Prime9

Phone Tapping Case Update: అధికారుల దర్యాప్తు.. 600 మంది ఫోన్లు ట్యాప్‌.. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, రాజకీయ ప్రముఖులు!

600 Phone Tapping Victims Attends SIT Investigation: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు సిట్‌ గుర్తించింది. ఇప్పటి వరకు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని అధికారుల దర్యాప్తులో తేలింది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు.

 

బాధితుల వివరాల ప్రకారం..  ప్రభాకర్‌రావుతో సహా నలుగురు నిందితులను కలిపి విచారించాలని సిట్‌ భావిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 2గంటల పాటు ప్రభాకర్‌రావు తమకు బ్రీఫింగ్‌ ఇచ్చే వారని నలుగురు నిందితులు సిట్‌ అధికారులకు వివరించారు. పోల్‌-2023 వాట్సాప్ గ్రూప్‌పై ప్రభాకర్‌రావును సిట్‌ ప్రశ్నించనుంది. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సన్నిహితులు గాలి అనిల్, వినయ్‌‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుపై సిట్‌ ఆరా తీసింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్‌ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. 2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేశారని సిట్‌ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.

 

Exit mobile version
Skip to toolbar