Prime9

Break for Operation Kagar: ఆగిన కూంబింగ్, ప్రశాంతంగా కర్రెగుట్ట!

Break for Operation Kagar:  తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో ఇరవై రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు కగార్ ఆపరేషన్ నిలిపివేసి వెను తిరిగి వెళ్లిపోవడంతో బాంబుల మోత ఆగిపోయింది. దీంతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇక ఛత్తీస్‌గఢ్ వైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా, బస్తర్ ఫైటర్స్‌తో కూంబింగ్ జరుగుతోంది.

 

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ తో భారత్ ఢీకొంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయి యుద్దం దిశగా రెండు దేశాలు సన్నద్దమయ్యేందుకు సిద్ధమయ్యాయి. పాకిస్థాన్ డ్రోన్ లతో భారత భూభాగంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించింది. అయితే భారత డిఫెన్స్ సిస్టమ్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఆపై పాకిస్థాన్ లోని మిటరీ బేస్ లను కూల్చింది. ఐదు యుద్ద విమానాలను భారత్ కూల్చింది.

 

పాకిస్థాన్ తో పూర్తి స్థాయి యుద్దం చేయడానికి భారత్ సిద్దమైంది. అందులో భాగంగా మావోయిస్టులను మట్టుబెడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలను యుద్ధరంగానికి పిలిచింది. దీంతో కర్రెగుట్టలో కూంబింగ్ ఆపి తిరిగి వెళ్లాయి బలగాలు. దీంతో మావోయిస్టులు ఊపిరితీసుకున్నారు. చాలా రోజులనుంచి కాల్పులు ఆపి తమతో చర్చలు జరపాల్సిందిగా మావోయిస్టులు కోరుతున్నారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు బలగాలు తమంతట తామే వెనుదిరగడంతో మావోయిస్టులు, వారి సపోర్టర్స్ ఊపిరిసలిపారు.

Exit mobile version
Skip to toolbar