Prime9

Fish Prasadam: జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. రెడీగా లక్షన్నర చేప పిల్లలు

Minister Ponnam Visited Fish Prasadam Arrangements: హైదరాబాద్ లో చేపప్రసాదం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీపై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు. చేప ప్రసాదం పంపిణీకి ఇప్పటికే లక్షన్నర చేప పిల్లలను ఫిషరీస్ కార్పొరేషన్ సిద్ధం చేసింది.

చేప ప్రసాదం పంపిణీలో బారికేడ్లు, క్యూ లైన్ లో ఇబ్బందులు, భద్రత ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి తాగునీరు ఏర్పాటు చేయాలని, భోజన వసతి కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కావల్సిన ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం సూచించారు. ఈనెల 6వ తేదీ నుంచే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version
Skip to toolbar