Prime9

Ponguleti Srinivas Reddy : భూమిలేని రైతులకు గుడ్‌న్యూస్.. జూన్ 2న పట్టాలు పంపిణీ : మంత్రి పొంగులేటి

Good news for Farmers : జూన్ 2వ తేదీన భూమి లేని నిరుపేద రైతులు అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నవారికి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మరోసారి రిపీట్ కావొద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని సూచించారు. చిన్న చిన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సరదాల కోసం ఉద్యోగాలు చేయొద్దని స్పష్టం చేశారు. ఇది పేదల ప్రభుత్వమన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ శాఖలో ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని సూచించారు. ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలని తెలిపారు.

 

గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆదేశించారు. ఒక్క కొత్త చెట్టు కూడా నరికివేయొద్దని స్పష్టం చేశారు. ఇదే అదును చూసుకొని అటవీ అధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారని, ఇక నుంచి పోడు భూముల సాగు గురించి బానర్ ఐటం కథనాలు రావొద్దన్నారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్‌గా ఉందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారం ఉన్నా రాష్ట్రాల్లో కూడా ఇంటికి ఐదు లక్షలు ఇవ్వడం లేదన్నారు. పేదవాడికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులకు కాకుండా ఇల్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క రూపాయి లంచం తీసుకున్న సహించేది లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ముసుగులో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు కాకుండా ఐటీడీఏ పరిధిలో పెంచుదామని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar