Hyderabad Rains : హైదరాబాద్‌లో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, బాలానగర్, సనత్‌నగర్, కోఠి, నాంపల్లి, చార్మినార్, మలక్‌పేట, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో రెండు గంటలపాటు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు నేడు తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది.