Prime9

CM Revanth Reddy: నేడు యాదాద్రి జిల్లాకు సీఎం.. అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు

Yadadri Bhuvanagiri: సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

 

బహిరంగ సభ అనంతరం సీఎం రేవంత్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. తిరుమలాపూర్ బహిరంగ సభ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ ను మళ్లించారు. ప్రజ్ఞాపూర్ నుంచి భువనగిరి మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. భువనగిరి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు. కనుక వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. రాచకొండ కమిషనర్ భద్రత ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar