Prime9

CM Revanth Reddy : నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళాలు ఇద్దాం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన

Decision to donate to the National Defense Fund : పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు భట్టి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి నెల జీతం విరాళంగా ప్రకటించనున్నారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల జీతం విరాళంగా ప్రకటించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

 

భారత ఆర్మీకి మంచి జరగాలి..
భారత నెలపై పర్యాటకులను చంపిన తీవ్రవాదులను ఏరివేత లక్యంగా మన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యేందుకు దేవాదాయ శాఖకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు జారీచేశారు. మన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని తెలంగాణలోని అన్నీ దేవాలయంలో పూజలు చేయాలని ఆదేశించారు. ఇంతటి సంక్లిష్టమైన సమయంలో భారత ఆర్మీకి అంతా అండగా నిలువాలని కోరారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ రెండో దాడి విజయవంతం కావటం హర్షించదగ్గ విషయమన్నారు.

 

పుల్వామాలో కోల్పోయిన వీర సైనికులను తిరిగి తీసుకురాలేమని, వారి త్యాగం శాశ్వతమన్నారు. జీవిత కాలం వారిని స్మ‌రించుకుంటామన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం దేశ భ‌ద్ర‌త విష‌యంలో అంద‌రినీ క‌లుపుకోవాలన్నారు. తాము భారత ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉన్నామని, రానున్న రోజుల్లో అండగా ఉంటామన్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గుడి, దేవాలయాల్లో ఆర్మీకి మంచి జరగాలని పూజలు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar