Site icon Prime9

WhatsApp Update: మరో ఫీచర్ ను అప్ డేట్ చేయనున్న వాట్సాప్

WhatsApp Update

WhatsApp Update

WhatsApp Update: యూజర్ల కోసం వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఇప్పటికే ఆడియో చాట్స్, వ్యూ వన్స్ ఆడియో, ఎడిట్ మెసేజ్ లాంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లను టెస్టింగ్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా మరో ఫీచర్ ను అప్ డేట్ చేసేందుకు వాట్సాప్ సిద్ధమైంది. డిస్ అప్పీయరింగ్ మెసేజ్ ల ఫీచర్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోన్న వాట్సాప్ .. మరోసారి ఈ ఫీచర్ లో ఛేంజెస్ చేయనుంది.

ఈ ఫీచర్ లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లను యూజర్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మార్పుల ద్వారా యూజర్స్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం.. ఇతరులు చూడకుండా త్వరగా డిలీట్ అవుతాయని వాట్సాప్ భావిస్తోంది.

 

డిస్‌ అప్పియరింగ్‌ లో మరో 15 ఆప్షన్లు(WhatsApp Update)

డిస్‌ అప్పియరింగ్‌ ఫీచర్‌లో ప్రస్తుతం 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల టైమ్‌ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అంటే యూజర్‌ డిస్‌అప్పియరింగ్ ఆప్షన్‌ను ఆన్‌ చేసి ఈ 3 టైమ్‌ లిమిట్స్ ఏదైనా ఒకదాన్ని ఎంచుకునే వీలు ఉంది. 7 రోజుల టైమ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. మెసేజ్‌ చూసిన 7 రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్‌ అవుతాయి. ప్రస్తుతం ఉన్న మూడు టైమ్‌ ఆప్షన్లకు మరో 15 ఆప్షన్లను యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

కొత్తగా రాబోయే ఆప్షన్లలో ఒక గంట నుంచి ఒక ఏడాది వరకు ఉంటాయని సమాచారం. డిస్‌ అప్పియరింగ్‌ మెసేజెస్‌ ఆన్‌ చేసిన తర్వాత అందులో మోర్‌ ఆప్షన్‌లో కొత్తగా తీసుకురానున్న టైమ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

 

Exit mobile version