Site icon Prime9

Whatsapp: వాట్సప్ లో పాత మెస్సేజ్‌లు సెర్చ్ చేసే కొత్త ఫీచర్ వచ్చేసింది!

whatsapp 2 prime9news

whatsapp 2 prime9news

Whatsapp Update: వాట్సప్ నుంచి మరో కొత్త ప్రకటన వెల్లడించారు. మనం సెర్చ్ మెస్సేజెస్ డేట్ తో మనకు కనిపించేలా కొత్త ఫీచర్ త్వరలో మన ముందుకు రాబోతుంది. వాట్సప్ యాప్‌ లో న్యూ క్యాలెండర్ ఐకాన్‌ పై మనం డేట్ ను టైప్ చేసిన తరువాత పాత మెస్సేజ్ సమాచారాలను సెర్చ్ చేసే ఫీచర్ ఇది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ పై వాట్సప్ టెక్నాలజీ వర్క్ చేస్తుంది. త్వరలో దీన్ని మన ముందుకు తీసుకురానున్నారు.

పాత మెస్సేజ్‌లు సెర్చ్ చేసే కొత్త ఫీచర్..

బీటా అప్‌డేట్ బ్లాగ్ వారు ఈ వాట్సప్ ఫీచర్ విషయాన్ని వెల్లడించారు. ఈ ఫీచర్ పాత మెస్సేజ్ సెర్చే చేసే ఫీచర్‌పై మాత్రమే చేస్తుందని వెల్లడించారు. ఈ ఫీచర్ ను రెండేళ్ల కిందటే తీసుకొచ్చి కొన్ని కారణాల వల్ల వెంటనే నిషేధించింది. మళ్ళీ ఇప్పుడు లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఇలా చేయవచ్చు..

వాట్సప్ ఇటీవల కొత్త ఫీచర్ ను ఒకటి లాంచ్ చేసినట్టు మన అందరికి తెలిసిందే. ఈ ఫీచర్ వల్ల వాట్సప్ యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరు చూడకుండా హైడ్ లో పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో వచ్చాక ప్రైవసీ సెట్టింగ్‌లో భాగంగా కొన్ని మార్పులు వచ్చాయి. వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎక్కౌంట్స్‌లోకి వెళ్ళి ప్రైవసీ సెలెక్ట్ చేసి, అక్కడ లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ ఉంటే ఈ ఫీచర్ మీ ఫోనులో అప్డేట్ ఐనట్టే.

Exit mobile version