Site icon Prime9

Twitter: ట్విట్టర్ మన ముందుకు కొత్త ఆప్షన్ను తీసుకురానుంది !

twitter prime9news

twitter prime9news

Twitter: ట్విటర్‌లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. మనం ఒక్కసారి ట్వీట్‌ చేసిన తరువాత తప్పులు ఉంటే మళ్ళీ మనం ఎడిట్‌ చేసే ఆప్షన్ ఇప్పటి వరకు లేదు. అయితే ఇక్కడ ఎడిట్‌ బటన్‌ వల్ల మనం రాసిన ట్వీట్‌ పబ్లిష్‌ అయిన 30 నిమిషాల్లోపు మాత్రమే ట్వీట్‌ను ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆ అవకాశం ఉండదు లేదా పబ్లిష్ చేసిన తరువాత 30 సెకన్ల లోపు అన్‌డూ ద్వారా ట్విటును కూడా డిలీట్ చేయవచ్చు.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 320 మిలియన్ల మంది ట్విట్టర్ యాక్టివ్‌ అకౌంట్ యూజర్లు ఉన్నారని ట్విట్టర్ తెలిపింది. ఐతే చాలా కాలం నుంచి ఈ ఎడిట్‌ ఆప్షన్‌ను గురించి చాలా సార్లు చర్చలు జరిగాయి. యూజర్లు కూడా ఎప్పటి నుంచో ఈ ఆప్షన్ రావాలని కోరుకుంటున్నారు. కానీ ట్విటర్‌ మాత్రం దానికి ఒప్పుకోలేదు. దానితో ఇప్పుడు తీసుకొస్తున్నా ఈ ఆప్షన్‌ ముందు ముందు ట్విట్టర్ అకౌంట్ యూజర్లలందరికీ అందుబాటులో ఉంచుతారని తెలిసిన సమాచారం.

ఐతే 2020 లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఈవో జాక్‌ డోర్సే, ట్విట్టర్ ఈ ట్వీట్ ఫీచర్ ఆప్షన్ ఎప్పటికి ట్వీట్‌ తీసుకురారని, తేకపోవచ్చని కామెంట్‌ చేశాడు. ఈ ఫీచర్‌ వల్ల తప్పుడు సమాచారాలు ఎక్కువ అవుతాయని, ఆయన తెలిపారు. ఈ ట్వీట్ ఫీచర్ తీసుకొచ్చిన తరువాత ఎలాంటి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చెందుతాయో వేచి చూడాలి.

 

Exit mobile version