Twitter Logo: ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. అయితే తాజాగా మరో మార్పుతో అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సారి మాత్రం ట్విటర్ లోగో లోనే ఛేంజెస్ చేశాడు. ట్విటర్ అనగానే గుర్తుకు వచ్చేది బ్లూ బర్డ్ లోగో. కానీ ఇప్పడు ఆ లోగోని తీసేసి దాని ప్లేసులో కుక్కు లోగోను పెట్టాడు ఎలాన్ మస్క్. అయితే ఈ మార్పు డెస్క్ టాప్ యూజర్స్ కు మాత్రమే కనిపించనుంది. మొబైల్ యాప్ లో మాత్రం బ్లూ బర్డ్ లోగో ఉండనుంది.
మంగళవారం ఉదయాన్నే ట్విటర్ యూజర్లకు కొత్త లోగో క్రిప్టో కరెన్సీ అయిన ‘డోజీ కాయిన్‘ను సంబంధించిన డోజీ మీమ్ దర్శనమిచ్చింది. దీంతో ఒక్క క్షణం యూజర్లు గందరగోళానికి గురయ్యారు. చూస్తున్నది ట్విటరా? కాదా; అని చెక్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది యూజర్లు మారిన లోగోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అప్పట్లో చెప్పినట్టుగానే..(Twitter Logo)
కాగా, ట్విటర్ లోగో మార్పును ఎలాన్ మాస్క్ కూడా కన్ఫార్మ్ చేశాడు. ఇకపై ట్విటర్ లోగో గా డోజీ మీమ్ ఉండనుందని ట్వీట్ చేశాడు. ఇక బ్లూబర్డ్ ఓల్డ్ వెర్షన్ అని తెలియజేస్తూ కొత్త లోగో ఉన్న మీమ్ ను ట్వీట్ కు జత చేశాడు. ఈ సందర్బంగా 2022, మార్చి 26 నాటి పాత చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నాడు. అందులో ఓ యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను డాగ్ గా మార్చాలని అడిగాడు. దానికి మస్క్ అప్పట్లో సానుకూలంగా రియాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో అప్పుడు చెప్పినట్టు ట్విటర్ లోగోను మార్చినట్టు చెప్పాడు. అయితే ఈ లోగో శాశ్వతంగా ఉండనుందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
— Elon Musk (@elonmusk) April 3, 2023
ఏంటీ డాగీ స్పెషల్
జపాన్ జాతికి చెందిన ‘షిబా ఇనూ’ అనే కుక్క ఫొటోనే డోజీగా పిలుస్తుంటారు. 2013 లో మొదటి సారి డోజీకాయిన్ క్రిప్టో కరెన్సీకి.. ఈ డోజీని లోగో గా క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ డోజీ మీమ్ బాగా వైరల్ అయింది. ఎలాన్ మస్క్ కూడా డోజీకాయిన్ కు మొదటి నుంచి మద్దతిస్తున్నారు. గతంలో కూడా ఆయన ట్విటర్ వేదికగా ప్రమోట్ చేశారు కూడా. ఇపుడు ఏకంగా డీజీ మీమ్ ట్విటర్ లోగో గా పెట్టాడు. దీంతో కాయిన్ విలువ ఒక్కసారిగా పెరిగింది. గత 24 గంటల్లో డోజీ కాయిన్ విలువ 22 శాతం పెరిగేలా చేశాడు ఎలాన్ మస్క్.
As promised pic.twitter.com/Jc1TnAqxAV
— Elon Musk (@elonmusk) April 3, 2023