Site icon Prime9

TikTok vs YouTube: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ కన్నా టిక్ టాక్ వీక్షకులే ఎక్కువ

Technology: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు మరియు యుక్తవయస్కులు చైనీస్ షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్ టాక్ లో ప్రతిరోజూ సగటున 91 నిమిషాల కంటెంట్‌ను చూస్తున్నారు. అయితే యూట్యూబ్ లో కేవలం 56 నిమిషాలు మాత్రమే గడుపుతున్నారు.

2021కి సంబంధించిన ఈ డేటా వివిధ వయస్కులవారిని తన అధ్యయనంలో తీసుకుంది. వీరిలో 1990ల మధ్య నుండి చివరి వరకు, 2010ల ప్రారంభం నుండి మధ్యకాలం తర్వాత జన్మించిన వారు వున్నారు. టిక్ టాక్ జూన్ 2020లో ప్రారంభమైంది. ఇది 4 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు చూసే సమయం సగటు నిమిషాల పరంగా యూ ట్యూబ్ ని అధిగమించడం ప్రారంభించింది.

యుఎస్‌లోని పిల్లలు మరియు యుక్తవయస్కులు గత సంవత్సరం టిక్‌టాక్‌లో రోజుకు సగటున 99 నిమిషాల పాటు యూట్యూబ్‌లో 61 నిమిషాలు గడిపారు. యూకేలో, టిక్‌టాక్ వినియోగం రోజుకు 102 నిమిషాల వరకు ఉంది. యూట్యూబ్‌లో కేవలం 53 నిమిషాలు మాత్రమే.
యూట్యూబ్ షార్ట్‌లు అనే షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్‌ను కూడా కలిగి ఉంది, ఇది ప్రారంభించిన రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో లాగిన్ చేసిన నెలవారీ వినియోగదారుల సంఖ్య 1.5 బిలియన్లను దాటింది. యూజర్లలో పిల్లలు మరియు యుక్తవయస్కులు మాత్రమే కాకుండా అన్ని వయస్సులకు చెందినవారు వున్నారు. టిక్‌టాక్, పిల్లలు మరియు యుక్తవయస్కుల వీక్షణ అనుభవాన్ని మరింత సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ‘కంటెంట్ లెవల్స్’ ఫీచర్‌ను బుధవారం ప్రవేశపెట్టింది.

Exit mobile version