Site icon Prime9

Vu Glo LED TV Series : Vu Glo Led టీవీ సిరీస్ సంస్థ వారు లాంచ్ చేసిన టీవీల వివరాలు ఇవే

smart tv prime9news

smart tv prime9news

Vu Glo LED TV Series: Vu Glo Led టీవీ సిరీస్ సంస్థ వారు (Vu Glo LED TV Series) కొత్తగా లాంచ్ చేశారు.
ఈ టీవీ సిరీస్‌లో మూడు వేరియంట్లగా మన ముందుకు రాబోతున్నాయి.50 ఇంచులు, 55 ఇంచులు, 65 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లగా టీవీలు వచ్చేశాయి. 4K అల్ట్రా HD డిస్‌ప్లేలు, HDR , డాల్బీ విజన్ సపోర్ట్‌ను ఈ టీవీలు కలిగి ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా కొత్త టెక్నాలజీతో డిజైన్ చేసినట్టు Vu సంస్థ వారు వెల్లడించారు. Vu Glo LED TV సిరీస్ స్మార్ట్ టీవీల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరలు కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.

Vu Glo LED TV సిరీస్ స్మార్ట్ టీవీల ధరలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.

Vu Glo LED TV సిరీస్ స్మార్ట్ టీవీ 50 ఇంచుల వేరియంట్ టీవీ ధర రూ.35,999గా ఉంది.
Vu Glo LED TV సిరీస్ స్మార్ట్ టీవీ 55 ఇంచుల వేరియంట్ ధర రూ.40,999 గా ఉంది.
Vu Glo LED TV సిరీస్ స్మార్ట్ టీవీ 65 ఇంచుల టాప్ వేరియంట్ ధర రూ.60,999 గా ఉంది.

అంతే కాకుండా ఆన్లైన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీలు ఇప్పటికే అమ్మకానికి పెట్టేసారు. SBI , HDFC కార్డ్‌ల నుంచి వీయూ గ్లో ఎల్ఈడీ టీవీలను మీరు కోనాలనుకుంటే మీకు రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Vu Glo LED TV సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

4K అల్ట్రా హెచ్‌డీ రెజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేతో వీయూ గ్లో ఎల్ఈడీ టీవీలు వస్తున్నాయి.50 ఇంచులు, 55 ఇంచులు, 65ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లలో ఈ సిరీస్‌లో టీవీలు వచ్చాయి.పైన ఉన్న అన్ని వేరియంట్ల టీవీల్లో ఒకేరకమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఉంటాయి .దీని ప్రత్యేకత ఏంటంటే 4K Ultra HD స్క్రీన్స్‌ను కలిగి ఉంది. పిక్చర్ క్వాలిటీ బాగా కనపడేందుకు AI Glo పిక్చర్ ప్రాసెసర్‌ను అమర్చి ఉన్నారు.Vu Glo LED TV సిరీస్ టీవీల్లో ర్యామ్ 2జీబీ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేటట్లుగా దీన్ని అమర్చారు. గదిలోని లైట్ ఉంటే ఆటోమేటిక్‌గా టీవీలో బ్రైట్ నెస్ కూడా మారిపోతు ఉంటుంది.అంతే కాకుండా గేమింగ్ కోసం మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు కూడా దీనిలో ఉంటాయని పేర్కొన్నారు. వైఫై, బ్లూటూత్, మూడు HDMI పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లతో ఈ టీవీలు ఉన్నాయి.

Exit mobile version