Realme 14x 5G: రేపు మధ్యాహ్నం రెడీగా ఉండండి.. రియల్‌మి నుంచి అదిరిపోయే బడ్జెట్ ఫోన్.. ఆ ఫీచర్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే..!

Realme 14x 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Realme 14x5Gని లాంచ్ చేయనుంది. ఇది 18, డిసెంబర్ 2024న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్‌కు ముందు కంపెనీ రాబోయే హ్యాండ్‌సెట్ కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్, బిల్డ్ వివరాలను నిర్ధారించింది. అలానే వీటితో పాటు మొబైల్ బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలను ప్రకటించింది. మీరు ఈ సరికొత్త మొబైల్‌ను కొనాలనే ప్లాన్‌లో ఉంటే అప్పటి వరకు దీని వివరాలను చూడండి.

కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం.. Realme 14x 5G శక్తివంతమైన 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఫోన్‌ను కేవలం 38 నిమిషాల్లో 0 శాతం నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేయచ్చు. అలాగే, మొత్తం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 93 నిమిషాలు మాత్రమే పడుతుంది.

Realme 14x 5G స్మార్ట్‌ఫోన్ 15 వేల రూపాలయల బడ్జెట్‌ లోపు భారతదేశపు మొదటి IP69 ఫోన్’ అని ప్రచారం జరుగుతుంది. ఇది IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ నుంచి మొబైల్‌ను ప్రొటక్ట్ చేస్తుంది. లీక్‌ల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో వస్తుంది. అందులో 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB RAM వేరియంట్లు ఉన్నాయి. ఇది 6.67-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.ఈ 5జీ మొబైల్ ఏప్రిల్‌లో భారతదేశంలో విడుదలైన Realme 12x 5Gకి సక్సెసర్‌గా ఉంటుంది.

Realme 14x 5G భారతదేశంలో డిసెంబర్ 18, 2024న మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌కి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఇ-స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ ఫోన్‌లో డైమండ్ ఇన్‌స్పైర్ బ్లాక్, గోల్డెన్, రెడ్ కలర్ ఆప్షన్‌లను పొందుతారు.

Realme 14x 5G Features And Specifications
ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలానే ఫోన్ తగినంత స్టోరేజ్ కోసం 3 కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంటుంది. వీటిలో 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. ఇది కాకుండా ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్ట్ చేస్తుంది, అది కూడా రూ. 15 వేల కంటే తక్కువ ధరకే. పవర్ కోసం హ్యాండ్‌సెట్‌కు 6,000mAh బ్యాటరీ, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.