Site icon Prime9

Samsung Galaxy M53 5G: సామ్‌సంగ్‌ గెలాక్సీ M53 5G స్మార్ట్‌ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇవే!

samsung 11 prime9news

samsung 11 prime9news

Samsung: సామ్‌సంగ్‌ గెలాక్సీ M53 5G స్మార్ట్‌ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ Display ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 12 + 1UI 4.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ M53 5G స్మార్ట్‌ ఫోనులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.108మెగాపిక్సెల్ ప్రైమరీ + 8 మెగాపిక్సెల్, ultra vide యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుక వైపు నాలుగు కెమెరాలు అమరి ఉంటాయి.

సామ్‌సంగ్‌ గెలాక్సీ M53 5G స్మార్ట్‌ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉంది. 6 ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499. ఈ మొబైల్ రూ.30,000 లోపు వచ్చి ఇతర స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కు మంచి పోటీ ఇచ్చింది.

ప్రస్తుతం అమెజాన్‌లో సామ్‌సంగ్‌ గెలాక్సీ M53 5G ధరలు చూస్తే 6GB+128GB వేరియంట్ ధర రూ.28,999 ధరకు, 8GB+128GB వేరియంట్ ధర రూ.30,999 గా ఉన్నాయి.

Exit mobile version