Reliance Jio: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అయితే 2023 ఐపీఎల్ లీగ్ రానే వచ్చింది. మార్చి 31 నుంచి ఐపీఎల్(IPL) ప్రారంభం కాబోతోంది. గత ఏడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి పోరుతో 2023 ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ 3 జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది.
ఈ ప్లాన్స్ లో రోజు వచ్చే 3 జీబీతోపాటు అదనంగా 2 జీబీ నుంచి 40 జీబీ వరకు డేటాను ఉచితంగా వస్తుంది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు రూ. 999, రూ. 399, రూ. 219 గా కంపెనీ(Reliance Jio) నిర్ణయించింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్‌లను పరిచయం చేసినట్లు జియో వెల్లడించింది. మార్చి 24 నుంచి ఈ రీఛార్జ్ ప్లాన్స్ జియో యూజర్లకు అందుబాటులో ఉండనున్నాయి.
జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు(Reliance Jio)
రూ. 999 తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు రోజువారీ 3 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు రూ. 241 విలువైన ఓచర్‌ను అందిస్తున్నారు. ఈ ఓచర్‌తో యూజర్లకు 40 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. 84 రోజుల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది.
ఇక, రూ. 399తో రీఛార్జ్ చేస్తే 28 రోజులు వ్యాలిడిటీతో రోజువారీ 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు రూ. 61 విలువైన ఓచర్ లభిస్తుంది. దీంతో 6జీబీ డేటాను యూజర్లు పొందొచ్చు.
రూ. 219 రీఛార్జ్‌తో రోజువారీ 3 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ పాటు అదనంగా 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు.
ఈ ప్లాన్‌తో పాటు క్రికెట్ డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా జియో ప్రకటించింది. సాధారణ రీఛార్జ్‌కు అదనంగా రూ. 222 తో రీఛార్జ్ చేసుకుంటే 50 జీబీ డేటా పొందొచ్చు. సాధారణ రీఛార్జ్ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు ఈ డేటా యూజర్‌కు అందుబాటులో ఉంటుంది. రూ. 444 తో రీఛార్జ్ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీతో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ. 667తో రీఛార్జ్ చేసుకున్న వారు 150 జీబీ డేటా పొందుతారు. దీని వ్యాలిడిటీ 90 రోజులు.