Site icon Prime9

Redmi Note 12: రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్స్ ధరలు ఎంతంటే?

red me prime9news

red me prime9news

Redmi Note 12 Series: రెడ్‌మీ నోట్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. చైనీస్ మార్కెట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ అడుగుపెట్టింది. రెడ్‌మీ నోట్ 12 5జీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 12ప్రో+ 5జీ, రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ బయటకు వచ్చాయి. అన్ని మోడళ్లు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే OLED Display ను కలిగి ఉన్నాయి. ఐతే వీటిలో Redme Note నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ప్రత్యేకంగా అనిపిస్తోంది.

రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి..
రెడ్‌మీ నోట్ 12 ప్రో+, రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ఫోన్స్ స్పెసిఫికేషన్లు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. అధిక ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌, బ్యాటరీ మాత్రమే వేరు వేరుగా ఉన్నాయి. 6.67 ఇంచుల ఫుల్ HD + OLED DISPLAY రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్/డిస్కవర్ ఎడిషన్ ఈ స్మార్ట్ ఫోన్‌ కలిగి ఉంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, HD 10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటాయి. మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 బేస్ట్ MIUI 13తో వస్తోంది.200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైకరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది.ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ ఉంది.

రెడ్‌మీ నోట్ 12ప్రో+ 5జీ, రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..
రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ 5G స్మార్ట్‌ఫోన్‌ చైనీస్ మార్కెట్‌లో విడుదల చేశారు. 8GB ర్యామ్+256GB స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌ ధర సుమారు రూ.27,200 గా ఉంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో+ ప్రారంభ ధర సుమారు రూ.23,000 గా ఉంది.

Exit mobile version