Site icon Prime9

Redmi Note 12 Pro+ : 210వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రెడ్‌మీ స్మార్ట్ ఫోన్

redme prime9news

redme prime9news

Redmi Note 12 Pro+ :  రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు పాపులర్ బ్రాండ్ షావోమీ సిద్దమైంది.చైనీస్ మార్కెట్‌లో రేపు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను విడుదల చేయనున్నారు.రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+, ఈ సిరీస్‌లో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానున్నాయి.ఇందులో రెడ్‌మీ నోట్ 12 ప్రో+ ఫ్లాగ్‌షిప్‌ స్పెసిఫికేషన్లతో అడుగుపెట్టనుంది.ఇప్పటికే ఈ ఫోన్‌ యొక్క కొన్ని వివరాలు బయటికి వచ్చాయి. Redmi Note 12 సిరీస్ భారత్‌తో పాటు మరిన్ని దేశాల్లో కూడా విడుదలవ్వ బోతుంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో+ వెనుక ప్రైమరీ కెమెరా గురించి సమాచారం తెలిసింది.200 మెగాపిక్సెల్ Samsung ISOCELL HPX సెన్సార్‌తో ఈ ఫోన్‌ వెనుక ప్రైమరీ కెమెరా ఉంటుంది.Sony IMX766 కంటే ఈ సెన్సార్ 24శాతం పెద్దగా ఉంటుందని షావోమీ సంస్థ వెల్లడించింది.ఈ ఫోన్‌ వెనుక మొత్తంగా మూడు కెమెరాలు ఉంటాయి.మరోవైపు ఈ స్మార్ట్‌ ఫోన్‌ 210వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని తెలిసిన సమాచారం.ఇదే నిజమైతే ప్రస్తుతం అత్యంత వేగవంతమైన ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌రెడ్‌మీ నోట్ 12 ప్రో+ అవుతుంది.

Exit mobile version