Realme 14x 5G: రియల్మీ తన కొత్త ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Realme 14x 5G పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ డిసెంబర్ 18న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌లోని ప్రత్యేకతలను కంపెనీ క్రమంగా వెల్లడిస్తోంది. ఫోన్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక సైట్‌లో లైవ్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ఈ ఫోన్ గురించి సమాచారాన్ని అందిస్తోంది. Realme ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్, రంగు ఆప్షన్లను వెల్లడించింది. తాజాగా కంపెనీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలను ప్రకటించింది. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలపై ఓ సారి చూద్దాం, మరి ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని ప్యాక్ చేసే 5G సెగ్మెంట్‌లో Realme 14x మొదటి ఫోన్ అని Realme తన అధికారిక సైట్‌లో తెలిపింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఫోన్ 38 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 100 శాతం ఛార్జ్ చేయడానికి 93 నిమిషాలు పడుతుందని కంపెనీ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల పాటు ఈ ఫోన్ ఉంటుందని కూడా వెల్లడించింది. ఫుల్ ఛార్జ్‌తో మీరు 45.4 గంటల పాటు కాల్‌లు చేయచ్చు లేదా 15.8 గంటల పాటు వీడియోలను చూడవచ్చు.
ఫోన్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్‌లో ఉంది. ఇది లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి వస్తుందని సూచిస్తుంది. ఫోన్ బ్లాక్, గోల్డ్, రెడ్ కలర్స్‌లో వచ్చేలా టీజ్ చేసింది కంపెనీ. ఫోన్ నీటిలో పడిపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఫోన్ దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉండటానికి IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుందని పేర్కొంది. రూ.15 వేల లోపు IP69 రేటింగ్‌తో భారత్‌లో ఇదే మొదటి ఫోన్.
ఈ రియల్‌మి 14x 5G మొబైల్ మూడు వేరియంట్‌లలో వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. అందులో 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఇది 6.67-అంగుళాల HD ప్లస్ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లాంచ్ సమయంలో భారతదేశంలో Realme 12x 5G ధర 4GB + 128GB వేరియంట్‌కు రూ. 11,999, 6GB + 128GB వేరియంట్‌కు రూ. 13,499 మరియు 8GB + 128GB వేరియంట్‌కి రూ. 14,999. ఇది కోరల్ రెడ్, ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ షేడ్స్‌లో రానుంది.