Site icon Prime9

Realme GT Neo 3T launch: రియల్‌మీ సంస్థ వారు లాంచ్ చేసిన కొత్త ఫోన్ వివరాలు ఇవే..

realme phone prime9news

realme phone prime9news

Realme GT Neo 3T launch price: రియల్‌మీ జీటీ నియో 3టీ మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స కొత్తగా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో ఈ రియల్‌మీ ఫోన్ వర్క్ అవుతుంది. 5జీ కనెక్టివిటీ, 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ మొబైల్‌ ఫోనులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే 12 నిమిషాల్లోనే 50శాతం చార్జ్ అవుతుందని రియల్‌మీ సంస్థ వారు పేర్కొన్నారు. ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వరకు సుమారు రూ.7వేల వరకు డిస్కౌంట్ లభిస్తుందని రియల్‌మీ సంస్థ వారు పేర్కొన్నారు.
Realme GT Neo 3T ఫోన్ ధర, సేల్‌, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్ల ఈ కింద విధంగా ఉన్నాయి.

Realme GT Neo 3T స్పెసిఫికేషన్లు:

స్క్రీన్ సైజ్ :6.7 ఇంచెస్
డిస్ప్లే రెసల్యూషన్ :1200×1080
బ్యాటరీ కెపాసిటీ :5000 mAh
డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‌టీఈ,బ్లూటూత్ 5.2,ఎన్‌ఎఫ్‌సీ,జీపీఎస్,యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.
ఈ వెనుక భాగంలో మూడు కెమెరాల అమరి ఉన్నాయి.64 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.

Realme GT Neo 3T ఫోన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
రియల్‌మీ జీటీ నియో 3టీ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.
6జీబీ ర్యామ్ + 128జీబీ ఫోన్ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.
8జీబీ ర్యామ్ + 128జీబీ ఫోన్ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది.
8జీబీ ర్యామ్ + 256జీబీ ఫోన్ వేరియంట్ ధర ధర రూ.33,999 గా ఉంది.
ఈనెల 23 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ సేల్‌కు ఉంటుంది.ఈ ఫోన్ డ్రిఫ్టింగ్ వైట్,డ్యాష్ ఎల్లో,షేడ్ బ్లాక్ కలర్లో మనకి లభిస్తుంది.

Exit mobile version