Site icon Prime9

Realme 11 Pro: రియల్ మీ ప్రో వచ్చేస్తోంది.. ధర ఎంతో తెలుసా?

real me

real me

Realme 11 Pro: కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే కొద్దీ రోజులు ఆగండి.. మీ అభిరుచికి తగిన మెుబైల్ మార్కెట్ లోకి త్వరలో అందుబాటులోకి రానుంది. రియల్ మీ 11 ప్రో.. భారత్ మార్కెట్లో జూన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ. 28వేలు లేదా రూ. 29వేల మధ్య ఉండవచ్చు.

అదిరిపోయే ఫీచర్స్.. (Realme 11 Pro)

కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే కొద్దీ రోజులు ఆగండి.. మీ అభిరుచికి తగిన మెుబైల్ మార్కెట్ లోకి త్వరలో అందుబాటులోకి రానుంది. రియల్ మీ 11 ప్రో.. భారత్ మార్కెట్లో జూన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ. 28వేలు లేదా రూ. 29వేల మధ్య ఉండవచ్చు.

 

రియల్‌మి 11 ప్రో+ ఫోన్ భారత మార్కెట్లో జూన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే రియల్ మీ 5జీ ఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫీచర్లు లీకయ్యాయి. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ ను కంపెనీ టైమ్‌లైన్‌ను ధృవీకరించింది. అయితే, రాబోయే ప్రీమియం 5G ఫోన్‌ కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు.

రియల్‌మి ఈ సిరీస్‌లో రెండు మోడళ్లను ప్రకటించే అవకాశం ఉంది. అందులో ఒకటి ప్రైమరీ మోడల్, మరొకటి ప్లస్ వేరియంట్. లాంచ్ ఈవెంట్ ముందు రియల్ మీ 11 ప్రో + కొన్ని ఫీచర్లు లీకయ్యాయి.
ఇక రియల్‌ మి 11 ప్రో ధర.. భారత మార్కెట్లో ధర రూ. 22వేలు లేదా రూ. 23వేల మధ్య ఉండొచ్చు. రియల్ మీ 11 ప్రో+ ధర రూ. 28వేలు లేదా రూ. 29వేలుగా ఉండవచ్చు.

రియల్‌మి 11ప్రో+ వెనుక 200-MP ప్రైమరీ కెమెరాతో వస్తుందని తెలుస్తోంది. లేటెస్ట్ ఆఫర్‌తో యూజర్‌లు గొప్ప కెమెరా అనుభూతిని పొందుతారని కంపెనీ పేర్కొంది. రియల్‌మి11 ప్రో+ తక్కువ ధర పరిధిలో 200-MP కెమెరాతో రానున్న ప్రపంచంలోనే మొదటి ఫోన్ కానుంది. వెనుక భాగంలో లెదర్ ఎండ్, వెనుక ప్యానెల్ వద్ద పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఫ్రేమ్‌లు గోల్డెన్ కోటింగ్ కలిగి ఉంటాయి. వెనుక ప్యానెల్‌లో ఆఫ్-వైట్ కలర్‌తో ఉంటాయి. ఈ ఫోన్ డిజైన్ కొంతవరకు ప్రీమియం నోకియా ఫోన్‌ల మాదిరిగా ఉండనుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మిగతా వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు.

ఈ డివైజ్ ను ఇప్పటికే చైనాలో వినియోగిస్తున్నారు. రియల్‌మి 11 Pro+ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

బ్యాక్ కెమెరా సెటప్‌లో 200-MP ప్రధాన కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-MP సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 32MP కెమెరా కూడా ఉంది.

రియల్‌మి 11 Pro+ ఫోన్ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 7050 SoC ఉంది. 12GB వరకు RAM, 1TB స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించుకోవచ్చు.

హుడ్ కింద కొత్త రియల్‌మి ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ను కలిగి ఉంది.

మెరుగైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

Exit mobile version