Site icon Prime9

MI SMART PHONE: ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే ఈ స్మార్ట్ వాచ్ ఫ్రీ !

mi smart prime9news

mi smart prime9news

MI SMART PHONE : దివాళీ విత్ MI సేల్ కొనసాగుతోంది.ఈ సేల్లో స్మార్ట్‌ఫోన్ల పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది ఎంఐ.ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ వాచ్ ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. రెడ్‌మీ నోట్ 11 SE మోడల్‌ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రెడ్‌మీ వాచ్ 2 లైట్ ఫ్రీగా పొందవచ్చు. రెడ్‌మీ నోట్ 11 SE స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో మనకి అందుబాటులో ఉంది. 6gb ర్యామ్ + 64gb స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.12,499 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బండిల్ ఆఫర్ ప్రకటించింది ఎంఐ. రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్‌ఫోన్, రెడ్‌మీ వాచ్ 2 లైట్ స్మార్ట్‌వాచ్ కలిపి ఈ రెండింటిని ఒకేసారి కొనుగోలు చేయవచ్చు.

ఈ రెండూ కలిపి ఒకేసారి రూ.14,200 ధరకు కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. ఐతే బ్యాంక్ ఆఫర్స్‌తో ఈ స్మార్ట్ ఫోన్ని రూ.12,599 కె కొనుక్కొవచ్చు. అంటే రెడ్‌మీ నోట్ 11 SE స్మార్ట్‌ఫోన్ ధరకే రెడ్‌మీ వాచ్ 2 లైట్ ఉచితంగా వచ్చినట్టే. రెడ్‌మీ వాచ్ 2 లైట్ స్మార్ట్ ఫోనుతో కాకుండా.. వేరుగా కొనుక్కుంటే రూ.4,999 ధరను పెట్టాలిసి ఉంటుంది. ఈ బండిల్ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకేనని ఎంఐ కంపెనీ చెబుతోంది.

ఇదీ  చదవండి :Oppo A17 : ఒప్పో సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !

Exit mobile version