Site icon Prime9

LiFi: వైఫై కంటే స్పీడుగా వచ్చేస్తున్న “లైఫై”.. మోడెమ్, రోటర్స్ కాదు బల్బ్ ఉంటే చాలు.. !

LiFi

LiFi

LiFi: టెక్నాలజీకి అనుగుణంగా మనం అప్డేట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతా వైఫై నడుస్తోంది.. ఇంటర్నెట్ లేనిదే పూట గడవదు ముద్ద దిగదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఈ కాలం యువత. నెట్ కొంచెం సేపు రాకపోతే చాలు ఏదో కోల్పోయినట్టు ఎంత హడావిడి చేస్తారనుకుంటున్నారు. అబ్బో అది వర్ణనాతీతం లెండి. అయితే ఇప్పుడు వైఫై కు మించిన సాంకేతికత మార్కెట్లోకి రానుంది.. అదే ‘లైఫై’. లైఫై అంటే ఏంటి ఇదిలా పనిచేస్తోందో ఓ సారి తెలుసుకుందాం.

బల్బ్ ఉంటే చాలు(LiFi)

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ WiFi స్పీడును అప్ డేట్ చేస్తోంది. కాంతి-ఆధారిత వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ల కోసం 802.11bb అనే కొత్త స్పీడో సాంకేతికతను జోడించింది. IEEE 802.11bb అని పిలువబడే ఈ ప్రమాణాన్ని LiFiగా పిలుస్తున్నారు. LiFiను “లైట్ ఫిడిలిటీ” అంటారు. ఇది విజిబుల్ లైట్ కమ్యూనికేషన్స్ సిస్టమ్. 100Gbps కంటే ఎక్కువ వేగంతో ఈ వైర్‌లెస్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్‌లను ప్రసారం చేస్తుంది. డేటాను ప్రసారం చేయడానికి LiFi సాంకేతికత రేడియో ఫ్రీక్వెన్సీలకు బదులుగా కాంతిని ఉపయోగిస్తుంది. అందుకే అంత వేగంగా ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు. WiFi, 5G వంటి వాటితో పోలిస్తే 100 రెట్లు వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లను అందించడానికి ఈ లైట్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకోవచ్చు.

లైఫై కోసం కాంతితరంగాలను వాడుతారు. LED లైట్ బల్బులను ఉపయోగించడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుంది. ఆ బల్బ్ లోపల, డేటా రిసీవర్ల నుంచి ఈ లైఫై కాంతి తరంగాలు ప్రయాణించేలా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు హై-స్పీడ్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడానికి LiFi అమర్చిన లైట్‌ని ఆన్ చేస్తే చాలు మీరు నెట్ సేవలను పొందవచ్చు. వీధి దీపాల్లో ఈ లైఫై లైట్ ను ఉపయోగించడం ద్వారా అందరికీ వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించవచ్చు. దీని ద్వారా పర్యావణానికి ఎటువంటి హానీ ఉండదని నిపుణులు చెప్తున్నారు.

Exit mobile version