Site icon Prime9

LIC Services: వాట్సాప్ లో ఎల్ఐసీ సేవలు.. ఎలాంటి డౌన్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు

LIC services

LIC services

LIC Services: మనలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలు తప్పకుండా ఉంటాయి. అయితే ఈ పాలసీల్లో ఎలాంటి డౌట్ వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా పరిష్కారం కోసం నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎల్ఐసీ సంస్థ తాజాగా.. తమ పాలసీదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ వాట్సాప్ సేవల ద్వారా లోన్ అర్హతలు, రీ పేమెంట్ ఎస్టిమేట్, ప్రీమియం డ్యూ డేట్స్ లాంటి వాటితో పాటు బోనస్ సమాచారం, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్, ఎల్ఐసి సర్వీస్ లింక్స్, పాలసీ స్టేటస్ గురించి తెలుసుకునే వీలు ఉంది. దీంతో చాలా అనుమానాలకు వాట్సప్ సేవలు సులభమైన ప్రక్రియ గా ఉండనుంది.

 

 

ఎల్ఐసీ కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించుకోవాంటే..(LIC Services)

 

మీ స్మార్ట్‌ఫోన్‌ నుంచి ‘8976862090’ అనే నెంబర్‌కి ‘హాయ్’ అని మెసేజ్ చేయాలి.

తర్వాత మీకు 11 ఆప్షన్ కనిపిస్తాయి. అందులో దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి.

మీరు ఎంచుకునే ఆప్షన్‌ని బట్టి రిప్లై వస్తుంది.

వాట్సాప్ చాట్‌లోనే మీకు అవసరమైన వివరాలను ఎల్ఐసి అందిస్తుంది.

 

Exit mobile version