5G Smart Phones: స్మార్ట్ ఫోన్, దీనిని ఉపయోగించని వాళ్లెవరూ లేరు. నేటి కాలంలో అరచేతిలోనే ప్రపంచమంతా చుట్టివచ్చేలా అరక్షణంలోనే దేశవిదేశాల సమాచారమంతా తెలుసుకునే అద్భుత సాధనం స్మార్ట్ ఫోన్. మరి వీటికున్న డిమాండ్ దృష్ట్యా వాణిజ్య కంపెనీలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలతో వివిధ రకాల ఫోన్ల మోడల్స్ ను తయారు చేస్తుంది.
వినియోగదారుల డిమాండ్ దృష్టా తాాజాగా 5 జీ స్మార్ట్ ఫోన్స్ లను చరవాణీ తయారీ కంపెనీలు అందుబాటులోకి తెస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరికీ అందుబాటులో ఉండేలా పలు ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు కూడా వీటిపై ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. మన దేశంలో రూ.20,000 లోపు 5జీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉందనే చెప్పుకోవచ్చు.
మరి ఆ స్మార్ట్ ఫోన్లు ఏంటో వాటి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూసేద్దామా..
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ దేశంలో ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.19,999, 8 జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ.21,999గా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
- పోకో ఎక్స్ 4 ప్రో 5జీ ఈ ఫోన్లు మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. 6 జీబీ ర్యామ్ +64 జీబీ స్టోరేజ్ తో ధర రూ.18,999 గా ఉంది. అలాగే 6 జీబీ+128 జీబీ ధర రూ.19,999గా.. 8జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.21,999 గా పోకో సంస్థ నిర్ణయించింది.
- ఒప్పో కే10 5జీ 8GB+128GB వేరియంట్ ఫోన్ను రూ.17,499 కే కొనుక్కోవచ్చు.
- ఐక్యూ జెడ్ 6 5జీ ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ స్టోరేజ్ తో వినియోగదారులకు రూ.15,499లకు అందుబాటులో ఉంది. అలాగే 6జీబీ+128 జీబీ మోడల్ ధర రూ.16,999 ఉండగా, 8 జీబీ+128 జీబీ మోడల్ ధర రూ.17,999 గా నిర్ణయించారు.
- రియల్ మీ 9 ప్రో ఈ చరవాణి 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ తో ధర రూ.17,999 కాగా, 8 జీబీ+128 జీబీ మోడల్ ధర రూ.20,999 లో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
- రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ ఈ సెల్ ఫోన్ 6 జీబీ + 128 జీబీ ధర రూ.20,999గా ఉండగా.. 8 జీబీ + 128 జీబీ ధర రూ.22,999, 8 జీబీ+256 జీబీ ఫోన్ను ధర రూ.24,999 కే కొనుగోలు చేయవచ్చు.
- శామ్‌సంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఈ ఫోన్ 6జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.18,999 ఉండగా.. 8జీబీ + 128జీబీ ధర రూ.20,499గా ఉంది.