Site icon Prime9

Koo Layoffs: ‘కూ’ యాప్ లో 30 శాతం కోతలు

koo layoffs

koo layoffs

Koo Layoffs: టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. కోవిడ్ 19 ప్రారంభమైన నాటి నుంచి టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి. ఈ కోతలు గత ఏడాది ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగుల ఉద్వాసనలు మరింత పెరిగాయి. ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు దేశంలోని పలు టెక్ కంపెనీలు ఇదే బాటలో వెళుతున్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘కూ’ (Koo)లో ఉద్యోగుల కోతలు మొదలయ్యాయి. కంపెనీలోని దాదాపు 30 శాతం ఉద్యోగులను ఇంటికి పంపింది. కంపెనీలో నష్టాలు, నిధుల సమీకరించడం భారం కావడం.. లాంటి కారణాలతో 260 మంది ఉద్యోగాలు తీసివేసినట్టు బ్లూమ్ బర్గ్ సంస్థ తెలిపింది.

ఫండింగ్‌ క్రష్ తో(Koo Layoffs)

గత ఏడాదితో పోలిస్తే మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘కూ’ సంస్థకు 75 శాతం మేర ఫండింగ్‌ తగ్గిందని ప్రముఖ రీసెర్చి సంస్థ ట్రాక్సన్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తొలగింపులు చేపట్టిందని మార్కెట్ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ‘కూ’సంస్థలో గత ఏడాది 15 మంది ఉద్యోగాలు కోల్పోయారు. లేఆఫ్‌లపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు. గ్లోబల్‌ సెంటిమెంట్‌తో పాటు వృద్ధి కంటే ప్రస్తుతం సామర్థ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడటం వల్ల ఉద్యోగాల కోతకు దారి తీసిందని పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు పరిహార ప్యాకేజీ, ఆరోగ్య బీమా, కొత్తగా ఉద్యోగాలు అన్వేషింకోవడంలో తోడ్పాటు లాంటి ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపారు.

 

‘ట్విటర్’ కు ప్రత్యామ్నాయంగా

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘ట్విటర్’ కు ప్రత్యామ్నాయంగా ‘కూ’యాప్ ప్రారంభం అయింది. బెంగళూరు కు చెందిన ఈ స్టార్టప్ మూడేళ్ల కింద అందుబాటులోకి వచ్చింది. తర్వాత ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన వార్ సందర్భంగా ఈ యాప్ బాగా లాభాలు చూసింది. ఈ యాప్ కు ప్రముఖ సెలబ్రెటీ లు కూడా ప్రచారం చేయడంతో అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇతర దేశాల్లోనూ కూ యాప్ ప్రవేశపెట్టారు. కానీ ఈ సంస్థలో ఫండింగ్ విషయంలో చెప్పుకోదగ్గ ఫలితాలు రాకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి నెమ్మదించింది.

 

మెటాలో మళ్లీ

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా లో ఈ వారంలో మరో 10 వేల మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే మెటాలో 11 వేల మందిని తొలిగించారు. మెటా లో మళ్లీ కోతలు ఉంటాయిని సంస్థ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ గత నెలలో హింట్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇపుడు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మెటా పరిధిలోని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, వర్చువల్ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్, క్వెస్ట్ హార్డ్ వేర్ లో ఈ నెలాఖరులో 10 వేల మందికి ఉద్వాసన పలకనుంది.

 

Exit mobile version