Jio 5G Network : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా తమ జియో ట్రూ 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. కొత్తగా జియో 5జీ సర్వీసులు అందుబాటు లోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. అలానే తక్కువ వ్యవధిలో విస్తృత స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో అవతరించింది.
ఏపీలో..
ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం ఉన్నాయి. గతంలో విజయవాడ, విశాఖ, తిరుమల, తిరుపతి, రాజమహేంద్రవరం, చిత్తూరు, కడప, నరసారావుపేట, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కర్నూలు, గుంటూరు తదితర నగరాలు/ పట్టణాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కొత్తగా 5జీ అందుబాటులోకి వచ్చిన మిగతా నగరాల వివరాలు..
మార్గోవ్ (గోవా)
ఫతేహాబాద్
గోహనా, హన్సి, నార్నాల్, పల్వాల్ (హర్యానా)
పౌంటా సాహిబ్ (హిమాచల్ ప్రదేశ్)
రాజౌరి (జమ్ము & కాశ్మీర్),
దుమ్కా (జార్ఖండ్)
రాబర్ట్‌సన్‌పేట్ (కర్ణాటక).
కన్హంగాడ్, నెడుమంగడ్, తాలిపరంబ, తలస్సేరి, తిరువల్ల (కేరళ)
బేతుల్, దేవాస్, విదిషా (మధ్యప్రదేశ్)
భండారా, వార్ధా (మహారాష్ట్ర)
లుంగ్లే (మిజోరం)
బైసనగర్, రాయగడ (ఒడిశా)
హోషియార్‌పూర్ (పంజాబ్)
టోంక్ (రాజస్థాన్)
కారైకుడి, కృష్ణగిరి, రాణిపేట్, తేని అల్లీనగరం, ఉదగమండలం, వాణియం బాడి (తమిళనాడు)
కుమార్‌ఘాట్ (త్రిపుర)
ఇదిలా ఉండగా, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్, ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తాలూకా, తహసీల్‌లను కవర్ చేసేలా జియో ట్రూ 5జీ సర్వీసులను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు రిలయన్స్ జియో పయనిస్తోందని ఆకాంక్షించారు. దేశంలోని మెజారిటీ ప్రాంతాలను జియో ట్రూ 5జీ సర్వీసులను విస్తరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ మేరకు జియో ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తమ జియో ట్రూ 5Gని వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. జియో (ట్రూ-5జీ ) పరిధిని వేగంగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. జియో వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను జియో వెల్‌కమ్ ఆఫర్ ను కూడా ఉచితంగా పొందవచ్చునని జియో ప్రతినిధి పేర్కొన్నారు.