Site icon Prime9

IPhone 14 Launch: సెప్టెంబర్ 7న యాపిల్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్

Iphone 14 Series: మార్కెట్లో యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్న క్రేజ్ ఇంకా ఏ ప్రొడక్ట్స్ కు లేదు. ఇప్పుడు యాపిల్ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ డేటాను ఖరారు చేసింది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేయనున్నారు. ఫార్ ఔట్ పేరుతో ఈ లాంచ్ పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వ హించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఈవెంట్ ఇన్విటేషన్ కూడా పంపింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని యాపిల్ సంస్థ వాళ్ళు వెల్లడించారు. 2022సెప్టెంబర్ 7 వ తేదీనా ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఈ ఈవెంట్ ఏ సమయానికి మొదలు అవుతుంది. ఏ సమయంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో కింద ఇచ్చిన వివరాలను చదివి తెలుసుకోండి.

యాపిల్ లాంచ్ ఈవెంట్ తేదీ..
సెప్టెంబర్ 7వ తేదీన యాపిల్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ మొదలు అవుతుంది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌, యూట్యూబ్ చానెల్, సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ అవ్వనుందని యాపిల్ సంస్థ వాళ్ళు వెల్లడించారు.

ఐఫోన్ 14 సిరీస్..
ఐఫోన్ 14 సిరీస్‌ లో మొత్తం నాలుగు ఐఫోన్ సిరీస్ లను విడుదల చేయనున్నాయి. ఐ ఫోన్ 14 , ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఇలా నాలుగు ఐఫోన్ సిరీస్ లాంచ్ చేయనున్నారు. ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ చిప్స్ కొత్తగా డిజైన్ చేసారని తెలుస్తుంది. ఐఫోన్ 14, 14 మ్యాక్స్‌లో బయోనిక్ ఏ15 ప్రాసెసరే ఉంటుందని తెలిసిన సమాచారం.

Exit mobile version