Site icon Prime9

Honda Activa 125: హోండా యాక్టివా 125 వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కేక.. ధరెంతో తెలుసా?

honda

honda

Honda Activa: ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం స్కూటీలదే హవా. ఒకప్పుడు వివిధ బైక్ లపై మోజు చూపిన యువత ఇప్పుడు స్కూటీలపై ఆసక్తిని చూపుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగానే మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా హోండా నుంచి మరో మోడల్ మార్కెట్లోకి వచ్చింది.

మార్కెట్లోకి హోండా ఆక్టీవా 125.. (Honda Activa 125)

ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం స్కూటీలదే హవా. ఒకప్పుడు వివిధ బైక్ లపై మోజు చూపిన యువత ఇప్పుడు స్కూటీలపై ఆసక్తిని చూపుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగానే మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా హోండా నుంచి మరో మోడల్ మార్కెట్లోకి వచ్చింది. కొత్త స్కూటర్ కొనేవారికి ఇదో మంచి అవకాశం.

హోండా యాక్టివా 125 2023 మోడల్ టీవీఎస్ జూపిటర్ 125, సుజుకి యాక్సెస్ 125 హీరో డెస్టినీ 125కు పోటీదారుగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ కొత్త వెహికల్ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

హోండా ఆక్టివా 2023 ధర రూ. 78,920 నుంచి మొదలై రూ. 88,093 (ఎక్స్-షోరూమ్, దిల్లీ) వరకు ఉంటుంది.

యాక్టివా 2023లో 125సీసీ పీజీఎం-FI ఇంజన్ ఉంది. దీనికి తోడు స్మార్ట్ పవర్ , హోండా ఎసీజీ స్టార్టర్, స్టార్ట్ సోలనోయిడ్‌ను ఇంటిగ్రేట్ అయింది.

కంపెనీ, ఇప్పుడు యాక్టివా 125 2023తో హోండా స్మార్ట్ కీ ని అందిస్తోంది. స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫీచర్లను అందిస్తోంది.

స్కూటర్ ఈక్వలైజర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ ని పొందుతుంది.

అల్లాయ్ వీల్స్ ట్యూబ్‌లెస్ టైర్‌లతో అమర్చబడి ఉంటాయి. కొత్త టైర్ కాంపౌండ్ టెక్నాలజీతో హోండా ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది.

హోండా యాక్టివా 125 ప్రముఖ ఫీచర్లలో ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రీస్టైల్ సిగ్నేచర్ పొజిషన్ ల్యాంప్స్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో సైడ్-స్టాండ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, పాసింగ్ స్విచ్, ఓపెన్ ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ (కొత్తది), రెండు-క్లోజడ్ ఇంధన ప్రారంభ సిస్టమ్‌తో వచ్చింది. అంతేకాకుండా, ఆక్టీవా 125 H-స్మార్ట్ వేరియంట్ లాక్ మోడ్‌తో అమర్చబడి ఉంది. ఫిజికల్ కీని వాడాల్సిన అవసరం లేకుండా ఫైవ్-ఇన్-వన్ ఫంక్షన్‌ను (లాక్ హ్యాండిల్, ఇగ్నిషన్ ఆఫ్, ఫ్యూయల్ లిడ్ ఓపెన్, సీట్ ఓపెన్ ఇగ్నిషన్ ఆన్) అందిస్తుంది.

హోండా యాక్టివా 125 2023 డ్రమ్ – రూ. 78,920
హోండా యాక్టివా 125 2023 డ్రమ్ అల్లాయ్ – రూ. 82,588
హోండా యాక్టివా 125 2023 డిస్క్ – రూ. 86,093
హోండా యాక్టివా 125 2023 హెచ్-స్మార్ట్ – రూ. 88,093

పై ధరలను నిర్ణయించారు.

 

Exit mobile version