Site icon Prime9

Google: ఆగష్టు నుంచి గూగూల్ డ్రైవ్ సేవలు నిలిపివేత

Google

Google

Google: టెక్నాలజీకి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 నుంచి విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (32 బిట్‌ వెర్షన్‌) ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్‌ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా విండోస్‌ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్‌ 2012 యూజర్లకు గూగుల్ డ్రైవ్‌ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.

ప్రస్తుతం విండోస్‌ 8 (32 బిట్‌ వెర్షన్‌) ఓఎస్‌ ఉపయోగిస్తున్న యూజర్లు తమ ఓఎస్‌ను విండోస్‌ 10 (64 బిట్‌ వెర్షన్‌) కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. అయితే, యూజర్లు గూగుల్ బ్రౌజర్‌ ద్వారా డ్రైవ్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చని తెలిపింది. సైబర్‌ దాడులు, యూజర్‌ డేటా భద్రత లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

 

సెర్చ్ చిప్స్‌ పేరుతో(Google)

ప్రస్తుతం డ్రైవ్‌ యాప్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి డ్రైవ్‌లో కొత్త ఫైల్స్ క్రియేషన్, స్టోరేజ్‌పై గూగుల్ లిమిట్ పెట్టింది. దీంతో గతంలో మాదిరి యూజర్లు అపరిమిత ఫైల్స్‌ క్రియేట్ చేసుకోలేరు. కేవలం ఐదు మిలియన్‌ ఫైల్స్‌ను మాత్రమే క్రియేట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. దాంతో పాటు డ్రైవ్‌లో సెర్చ్ చిప్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను కూడా గూగుల్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు అవసరమైన ఫైల్స్‌ను ఫిల్టర్ల సాయంతో ఈజీగా వెతుక్కోవచ్చని తెలిపింది.

 

Exit mobile version
Skip to toolbar