Site icon Prime9

Google : అతి త్వరలో గూగుల్ కొత్త ఫీచర్ మన ముందుకు రాబోతుంది!

password less login released by google

password less login released by google

Google News: గూగుల్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను మన ముందుకు తీసురానుంది.మీ డివైస్‌ను నుంచే రేటింగ్ తెలుసుకోవచ్చు. ఆ కొత్త ఫీచర్ గురించి పని చేసే విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ యాప్స్ అనేవి స్మార్ట్‌ఫోన్ల వరకే ఉండవు.అదే సమయంలో ఒకరి ఫోనులో వచ్చే టచ్ స్పీడ్ వేరే ఫోనులో రాకపోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ యాప్ విధానం ఏ ఇద్దరి ఫోన్స్ లో కూడా ఒకే విధంగా ఉండదు. ఫోన్ తీరును బట్టి ఒక్కో విధంగా పని చేస్తుంది. యూట్యూబ్,ఇతర స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించే వారికి ఎక్స్‌పీరియన్స్ వేరేలా ఉంటుంది. గూగుల్ ఇప్పుడు సరికొత్తగా ఒక కొత్త ఫిచర్ ను డిజైన్ చేసి ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచనుంది.ఈ ఫిచర్ యూజర్ల ఆధారంగా సమీక్షించి రేటింగ్ ను ఇస్తుంది.

గూగుల్ ఏడాది కిందటే ఆగస్టు 2021లో ఈ ఫీచర్ గురించి ప్రకటించింది. 2021 నవంబర్ నుంచి ఫోన్‌ వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లు ప్రత్యేక రేటింగ్ చూడవచ్చని అప్పట్లో వెల్లడించింది. అలాగే 2022 ఏడాది మొదటిలో ట్యాబ్‌లెట్, క్రోమ్‌బుక్ వంటి వాటిలో డివైస్ రేటింగ్ ఇస్తామని అప్పట్లోనే వెల్లడించారు.

ఎట్టకేలకు ఇప్పుడు ఆ కొత్త ఫీచర్ రోల్ అవుట్ మన ముందుకు తొందరలోనే వచ్చేస్తుంది. ఇప్పుడు యూజర్లు యాప్ రేటింగ్ డైరెక్టుగా చూడగలరు. ఈ ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూజర్లు డివైస్‌ను ఎంత మేరకు ఉపయోగిస్తున్నారో ఇక్కడ తెలుసుకోవచ్చు.

Exit mobile version