Wtc Final Aus vs Ind: ఆస్ట్రేలియాతో జరుగతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు 327/3 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మొదటి సెషన్ ముగిసే సమయానికి 422/7 తో కట్టడి చేయగలిగారు. పాట్ కమిన్స్ (22 నాటౌట్), అలెక్స్ కేరీ (2, నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇక రెండో సెషన్ లో వీలైనంత త్వరగా ఆసీస్ ను ఆలౌట్ చేయగలిగితే భారత్ విజయం అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
Lunch on Day 2 of the #WTC Final.
India pick up four wickets in the morning session.
Australia 422/7
Scorecard – https://t.co/5dxIJENCjB… #WTC23 pic.twitter.com/7LswiFu3mA
— BCCI (@BCCI) June 8, 2023
స్మిత్ సెంచరీ(Wtc Final Aus vs Ind)
ట్రావిస్ హెడ్ (146), స్మిత్ (95) స్కోర్లతో రెండో రోజు ఆటను కొనసాగించారు. మ్యాచ్ ప్రారంభం అయినా వెంటనే సిరాజ్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు బాది స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం షమీ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ ఫోర్ కొట్టి 150 మార్క్ ను అందుకున్నాడు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న హెడ్ ను సిరాజ్ ఔట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ 6 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో స్లిప్లో శుభ్ మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చాడు. స్మిత్ (121) దగ్గర శార్దూల్ ఠాగూర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ (5) ను సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ అక్షర్ పటేల్ అద్భుతమైన త్రో చేసిన రనౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది.