Wtc Final Aus vs Ind: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా టాస్ నెగ్గిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో చేరాడు. ఇక వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ బరిలోకి దిగుతాడు. మరోవైపు ఆసీస్ కూడా నులుగురు పేస్లర్లో బరిలోకి దిగింది. గ్రీన్, కమిన్స్, స్టార్క్, బోలండ్ ఫైనల్ టీమ్ లో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా నాథన్ లియోన్ ను కూడా టీమ్ లో ఉన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే..
పిచ్ ను అర్ధం చేసుకుంటూ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 3 ఓవర్ 4 వ బంతిని ఆడబోయిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) ఎడ్జ్ తీసుకోవడంతో కీపర్ కేఎస్ భరత్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 2 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఖవాజా 10 బాల్స్ ఆడినా పరుగులు చేయలేకపోయాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 22/1 గా ఉంది. క్రీజులో డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ లు ఉన్నారు. మొదటి రెండు ఓవర్లను షమీ, సిరాజ్ లు మెయిడిన్ గా వేశారు. గత 6 ఓవర్లలో 18 పరుగులు వచ్చాయి. సిరాజ్ వేసిన 6 ఓవర్ లో 8 పరుగులు రాగా, డేవిడ్ వార్నర్ ఓ ఫోర్ బాదాడు.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్) , ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
క్వాలిటీ క్రికెట్ ను ఆడతాం- రోహిత్
ఓవల్ గ్రౌండ్ పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టును ఎంపిక చేసుకున్నాం. పిచ్ మరీ ఎక్కువగా మారుతుందనుకోవడం లేదు. మేము క్వాలిటీ క్రికెట్ ను ఆడతాం.
నలుగురు స్పీమర్లు, ఒక స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. జడేజా జట్టులోకి వచ్చాడు. అయితే అశ్విన్ లాంటి అనుభవ బౌలర్ లేకుండా ఆడటం కష్టమే. రహానే అనుభవం పనికొస్తుంది.
అతనే మా ప్రధాన అస్త్రం- కమిన్స్(Wtc Final Aus vs Ind)
టాస్ గెలిస్తే మేము కూడా ముందు బౌలింగ్ చేయాలనుకున్నాం. నాలుగు, ఐదు రోజుల్లో బంతి టర్న్ అవుతుందనిపిస్తోంది. మా బౌలర్ స్కాట్ బొలాండ్ కీలకంగా మారతాడు.
అతనే మా ప్రధాన అస్త్రం. దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాం. వాతావరణం బాగుంది. ఒక్క సెషన్ కూడా మిస్ కాలేదు.
ఫైనల్ కు రెండు పిచ్ లు(Wtc Final Aus vs Ind)
డబ్ల్యూటీసీ ఫైనల్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రెండు పిచ్ లను సిద్ధం చేసింది. దీనికి కారణం చమురు ధలర పెంపుపై ఇంగ్లండ్ లో జరుగుతున్న ఆందోళనలు. ఈ నిరసన నేపథ్యంలో కొందరు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పిచ్ ను ధ్వంసం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.
దీంతో ఫైనల్స్ కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ఓవల్ క్రికెట్ గ్రౌండ్ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఐసీసీ నిబంధన 6.4 లో మార్పులు చేసి ప్రత్యామ్నాయ పిచ్ ను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.