Site icon Prime9

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత జట్టు ఇదే.. సూర్య ఔట్, రహానే ఇన్

WTC Final

WTC Final

WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత జట్టు ఖరారైంది. ఈ మేరకు తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. లండన్ లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 తేదీల్లో ఓవల్ వేదికగా ఈ టెస్ట్ ఫైనల్ జరుగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ లు ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫలితం తేలకుంటే 12 వ తేదీని రిజర్వ్ డే గా ప్రకటించారు.

కాగా, రోహిత్ శర్మ సారథ్యంల 15 మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఫైనల్ చేసింది. ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్ చోటు కోల్పోయాడు. మరో వైపు తాజా ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్న చెన్నై ఆల్ రౌండర్ అజింక్య రహానేను జట్టులోకి తీసుకుంది. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహాన్ జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమ్ లోకి తీసుకున్నారు. కేఎస్ భరత్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు.

 

డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత జట్టు (WTC Final)

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

 

 

Exit mobile version