World Cup 2023: వరల్డ్‌ కప్‌-2023 క్వాలిఫయర్ షెడ్యూల్‌ విడుదల

World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఐసీసీ క్వాలిఫయర్ షెడ్యూల్ ను విడుదల చేసింది.

World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఐసీసీ క్వాలిఫయర్ షెడ్యూల్ ను విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా.. ఈ టోర్నీ జరగనుంది. జూన్‌ 18 నుంచి జులై 9 వరకే ఈ టోర్నీలో.. 10 జట్లు పాల్గొంటాయి. ప్రతి గ్రూప్ కి 5 జట్లను కేటాయించారు. జింబాబ్వే, వెస్టిండీస్‌, ద నెదార్లండ్స్‌, నేపాల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ జట్లు గ్రూప్‌-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఒమన్‌, యూఏఈ జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి.

గ్రూపు జట్లు ఇవే..

ఐసీసీ వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఐసీసీ క్వాలిఫయర్ షెడ్యూల్ ను విడుదల చేసింది.

జింబాబ్వే వేదికగా.. ఈ టోర్నీ జరగనుంది. జూన్‌ 18 నుంచి జులై 9 వరకే ఈ టోర్నీలో.. 10 జట్లు పాల్గొంటాయి. ప్రతి గ్రూప్ కి 5 జట్లను కేటాయించారు.

జింబాబ్వే, వెస్టిండీస్‌, ద నెదార్లండ్స్‌, నేపాల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ జట్లు గ్రూప్‌-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఒమన్‌, యూఏఈ జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి.

తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్‌ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్‌ దశకు అర్హత సాధిస్తాయి.

ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్‌ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి.

 

సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి.

ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్‌ 2 ప్లేసెస్‌లో ఉన్న జట్లు భారత్‌ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి.

 

కాగా, భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే.

భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి.

ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.