Site icon Prime9

Women Ipl: మహిళల ఐపీఎల్.. స్మృతి మంధానకు భారీ ధర?

smriti

smriti

Women Ipl: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి సర్వం సిద్ధమైంది. ముంబై లోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వేలం ప్రారంభమైంది. స్మృతి మంధాన కోసం.. ముంబయి- ఆర్సీబీ జట్లు పోటీపడ్డాయి. చివరికి 3.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. మొత్తం 409 మంది క్రికెటర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో భారత్ నుంచి 246 మంది ప్లేయర్లు ఉండగా.. విదేశీ జట్ల నుంచి 163 మంది ఉన్నారు. మెుత్తం 90 మంది కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, గుజరాత్‌ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీ పడుతున్నాయి.

 

ఇక మరో బ్యాట్స్ వుమెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ని 1.80 కోట్లకు ముంబాయి సొంతం చేసుకుంది. హర్మన్ కోసం.. ఆర్సీబీ, ముంబయి, యూపీ వారియర్స్ పోటీ పడ్డాయి.

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీ గార్డనర్ కు సైతం భారీ ధర లభించింది. గుజరాయి జెయింట్స్ రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసింది.

వీళ్లకు కోట్లేనా!.. (Women Ipl)

దేశంలో మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ పేంచేందుకు బీసీసీఐ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో.. మహిళల ఐపీఎల్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో తెలుగు ప్లేయర్లు తమ లక్ ను పరీక్షించుకోనున్నారు. తెలుగు వారు.. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, అరుందతి రెడ్డి, గొంగడి త్రిష ఉన్నారు. అంజలి, సబ్బినేని, అరుందతి రెడ్డిలు ఇప్పటికే టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. ఇక ఈ మహిళల ఐపీఎల్ లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ లకు భారీ మెుత్తం లభించే అవకాశం ఉంది.

ఆల్ రౌండర్లకు ప్రాధాన్యం..

ఈ మహిళల ఐపీఎలో వేళంలో ఆల్ రౌండర్లకు భారీ మెుత్తం లభించనున్నట్లు తెలుస్తోంది. ఇక మెుదిటి సెట్ లో వేలానికి వచ్చిన ప్లేయర్ల జాబితాను విడుదల చేశారు. న్యూజిలాండ్ కు చెందిన
సోఫి డివైన్.. భారత్ కీలక ప్లేయర్స్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి సోఫి ఎక్లెస్టోన్.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ గార్డనర్, ఎలిస్ పెర్రి వేలానికి వచ్చారు. వెస్టీండిస్ నుంచి హేలీ మాథ్యూస్ సైతం మెుదటి సెట్ లో వేలానికి వచ్చారు.

హర్మన్ ప్రీత్ ను సొంతం చేసుకునేందుకు పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 146 మ్యాచులాడిన హర్మన్.. 2940 పరుగులు సాధించింది. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఇక బౌలింగ్ లో కూడా.. రాణించింది. ఇప్పటి వరకు 32 వికెట్లు పడగొట్టింది. 23పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం అత్యుత్తమ ప్రదర్శన.

Exit mobile version