Site icon Prime9

Wimbledon 2023: జులై 3 నుంచి వింబుల్డన్.. ఈసారి భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

Wimbledon 2023

Wimbledon 2023

Wimbledon 2023: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ప్రైజ్ మనీ పెరిగింది. ఈ ఏడాది వింబుల్డన్ లో 56.5 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 465 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్టు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది. పురుషుల, మహిళల సింగిల్స్ ఒక్కో విన్నర్ కు 3 మిలియన్ పౌండ్లు(రూ. 24 కోట్ల 43 లక్షలు) దక్కనున్నాయి. ఇది 2022 వింబుల్డన్ తో పోలిస్తే 11.2 శాతం ఎక్కువ.

 

 

జూలై 3 నుంచి వింబుల్డన్(Wimbledon 2023)

గత ఏడాది సింగిల్స్‌ విజేతలకు 20 లక్షల పౌండ్లు చొప్పున అందజేయగా.. ఈ ఏడాది 3 లక్షల 50 వేల పౌండ్లు అదనంగా ఇవ్వనున్నారు. మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ఓడిన ప్లేయర్లకు రూ. 57 లక్షల 18 వేలు లభిస్తాయి. క్వాలిఫైయింగ్ లో తొలి రౌండ్‌లో ఓడితే రూ. 13 లక్షల 25 వేలు, రెండో రౌండ్‌లో ఓడితే రూ. 22 లక్షల 61 వేలు, మూడో రౌండ్‌లో ఓడితే రూ. 37 లక్షల 42 వేలు దక్కనున్నాయి,

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరగనుంది. ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్‌, మహిళల సింగిల్స్‌లో రిబాకినా డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. వీరిద్దరు ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నారు. ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచిన జకోవిచ్ 24 వ టైటిల్ కోసం పోటీ పడనున్నాడు.

 

 

Exit mobile version