Hanuma Vihari: తెలుగు క్రికెటర్ హనుమ విహారి పట్టుదల ప్రదర్శించాడు. జట్టు కోసం గాయాన్నైనా లెక్క చేయకుండా పోరాటం చేశాడు. ఓ వేగమైన బంతికి హనుమ విహారి మణికట్టు విరిగింది. అయిన జట్టు కోసం అతడు బ్యాటింగ్ చేసిన తీరును క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఆంధ్రా క్రికెట్ జట్టు.. మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 16 పరుగుల వద్ద విహారి మణికట్టు విరిగింది.
ఇండియన్ క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు ప్రస్తుత కెప్టెన్ హనుమ విహారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
మ్యాచ్ లో గాయపడిన.. చేతివాటం మార్చుకుని బ్యాటింగ్ చేసిన తీరును సోషల్ మీడియా వేదికగా మాజీ క్రికెటర్లు, సహ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు.
మధ్యప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. అవేశ్ ఖాన్ బౌలింగ్ లో హనుమ విహారి ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది.
అప్పటికే 16 పరుగులు చేసిన విహారి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
తొలి రోజు రెండు వికెట్ల నష్టానికి.. 262 పరుగులు చేసిన ఆంధ్ర జట్టు.. రెండో రోజు వరుసగా వికెట్లు కోల్పోయింది.
Do it for the team. Do it for the bunch.
Never give up!!
Thank you everyone for your wishes. Means a lot!! pic.twitter.com/sFPbHxKpnZ— Hanuma vihari (@Hanumavihari) February 1, 2023
323 నుంచి 353 పరుగుల వరకు 9 వికెట్లను కోల్పోయింది. జట్టుకు మరిన్ని పరుగులు అందివ్వాలనే తాపత్రయంతో.. 11 వ స్థానంలో మళ్లీ బ్యాటింగ్ కి దిగాడు విహారి.
కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన హనుమ.. గాయం కారణంగా ఎడమ చేతితో బ్యాటింగ్ చేశాడు.
కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తే.. మరోసారి గాయం అవుతుందనే కారణంతో.. విహారి ఎడమ చేత్తో బ్యాటింగ్ కొనసాగించాడు.
ఎడమ చేతి బ్యాటింగ్ తో దాదాపు.. 20 బంతులకు ఎదుర్కొన్నాడు. ఇందులో రెండు బౌండరీలు బాదాడు. ఆఖరి వికెట్ రూపంలో విహారి ఔట్ అయ్యాడు.
దీంతో ఆంధ్ర జట్టు 379 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో ఆంధ్ర తరపున.. రికీ భుయ్, కరణ్ శిందేలు సెంచరీలు సాధించిన హనుమ విహారియే అందరి దృష్టినీ ఆకర్షించాడు.
జట్టు కోసం గాయాన్ని లెక్క చేయకుండా.. బ్యాటింగ్ చేయడంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
గాయపడిన విహారికి ఇబ్బంది లేకుండా.. మరో బ్యాటర్ లలిత్ మోహన్ ఎక్కువ స్ట్రైక్ తనకే ఉండేలా చూసుకున్నాడు.
ఇలా వీరిద్దరు దాదాపు 10 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేశారు.
అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడిన విహారి.. గాయపడ్డా తర్వాత అదే అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఒంటి చేత్తో రెండు ఫోర్లు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో గాయపడిన విహారి ఎడమ చేతి మణికట్టులో చీలిక ఏర్పడినట్లు ఎక్స్‌రేలో తేలింది.
ఈ గాయం కారణంగా.. 5 నుంచి 6 వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇలాంటి పోరాట పటిమనకు విహారి ఇదివరకే ప్రదర్శించాడు. 2021లో సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌ను అందరు గుర్తు చేసుకుంటున్నారు.
ఆ మ్యాచ్ లో కాలి గాయంతో కూడా విహారి బ్యాటింగ్ చేసి.. భారత్ ఓడిపోకుండా చూశాడు.
ఆ ఆ మ్యాచ్ లో 161 బంతులు ఆడిన విహారి.. 23 పరుగులు చేసి మ్యాచ్ డ్రా అయ్యేలా చుశాడు.
ఈ మ్యాచ్ లో అశ్విన్ తో కలిసి.. 42 ఓవర్ల పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశాడు. తాజా మ్యాచ్ పై అశ్విన్ స్పందించాడు.
విహారి అసలైన పోరాట యోధుడు అంటూ ట్వీట్ చేశాడు.
విహారి బ్యాటింగ్ పై.. దినేశ్ కార్తీక్, టీమ్‌ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, వెంకటేశ్ అయ్యర్, కామెంటరేటర్ హర్ష భోగ్లే, సినీ నటుడు సాయిధరమ్ తేజ స్పందించారు. హనుమ విహారిని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/