Vigilance Inquiry on HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్.. HCA సెక్రటరీ SRH ఫ్రాంచైజ్పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారించారు. హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది.
టికెట్ల కోసం SRH యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. SRH యాజమాన్యం పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్నా.. మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై సెక్రటరీ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఫ్రీగా 10 శాతం టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని SRH యాజమాన్యం తేల్చి చెప్పింది. SRH టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురిచేశాడు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేశారు. HCA సెక్రటరీ SRH ఫ్రాంచైజ్పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారణ కావడంతో.. హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది.