Usain Bolt: ప్రపంచ రికార్డు పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు గట్టి షాక్ తగిలింది. ప్రైవేటు పెట్టుబడుల సంస్థలో బోల్ట్ కు ఉన్న అకౌంట్ నుంచి దాదాపు రూ. 100 కోట్లు( 12 మిలియన్ డాలర్లు) మాయం అయ్యాయి. సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఈ స్కాంకు పాల్పడి డబ్బులు దోచుకున్నాడు.
జమైకాలోని కింగ్‌స్టన్‌కు చెందిన ఒక ప్రైవేటు పెట్టుబడి సంస్థ ‘స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్’లో ఉసేన్ బోల్ట్ పెట్టుబడి ఖాతా తెరిచాడు.
2012 లో తెరిచిన ఈ ఖాతాను రిటైర్ మెంట్, సేవింగ్స్ లో భాగంగా ఉపయోగిస్తున్నాడు బోల్ట్. అప్పటి నుంచి ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉన్నాయి.
బోల్ట్ అకౌంట్ ను పరిశీలించగా ప్రస్తుతం అందులో 12000 డాలర్లు మాత్రమే ఉన్నాయని బోల్ట్ న్యాయవాది వెల్లడించారు.
సరైన ఆడిట్ నిర్వహించగా బోల్ట్ ఖాతా నుంచి 12 మిలియన్ల డాలర్లు మాయమైందని ధ్రువీకరించారు. ఈ విషయంపై బోల్ట్ న్యాయవాది కంపెనీ ని వివరణ కోరారు.
కంపెనీ లో జరిగిన చర్యల వల్ల పెద్ద మొత్తంలో డబ్బు మాయమైందని ఆయన ఆరోపించారు.
పది రోజుల్లో చెల్లించాలి
బోల్ట్ ఖాతా నుంచి 12 మిలియన్ల డాలర్ల మాయం పై అతని మేనేజర్ నుజెంట్ వాకర్ మండిపడ్డాడు.
స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో బోల్ట్ 10 ఏళ్లుగా పైగా పెట్టుబడి పెట్టినట్టు ఆయన తెలిపారు.
తాజాగా బోల్ట్ అకౌంట్ లో తేడాలు గమనించామని.. దీంతో మొత్తం ఖాతా రివ్యూ చేస్తున్నామన్నారు.
మాయమైన డబ్బును కంపెనీ పది రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆయన పేర్కొన్నాడు. అందుకు సంబంధించి కంపెనీకి నోటీసులు కూడా పంపామన్నారు.
ఒకవేళ పది రోజుల్లో డబ్బు చెల్లించకపోయినా.. డబ్బు బకాయిలు ఉన్నా సదరు కంపెనీపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మాజీ ఉద్యోగి మోసం వల్లే
అయితే, జనవరి నెల ప్రారంభంలోనే ఈ మోసాన్ని గుర్తించినట్టు స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ తెలిపింది.
తమ ఖాతాదారుల అకౌంట్ల నుంచి మిలియన్ డాలర్ల డబ్బు మాయమైనట్టు జనవరి 12 న కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇది ఓ మాజీ ఉద్యోగి చేసిన మోసపూరిత చర్యల వల్ల జరిగిందని తెలిపింది.
బోల్ట్ తో సహా దాదాపు 30 మంది ఖాతాల్లో డబ్బులు పోయినట్టు పేర్కోంది. ఈ ఘటనపై ఫిర్యాదు చేశామని.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ తెలిపింది.
తమ కంపెనీ క్లయింట్స్ సెక్యూరిటీ తమకు చాలా ముఖ్యమని.. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటామంది.
కంపెనీపై చర్యలు
మరో వైపు బోల్ట్ ఘటపై జమైకా ఆర్థిక శాఖ స్పందించింది. ఇది తీవ్రమైన నేరమని.. ఈ నేరానికి పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలని అధికారులను సూచించింది.
అదే విధంగా సదరు కంపెనీపై కూడా చర్యలు చేపట్టింది. కంపెనీ కి సంబంధించిన కార్యకలాపాలను తాత్కాలికంగా జమైకా ప్రభుత్వ అధికారులు తమ చేతుల్లోకి తీసుకున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/