India opt to bowl against defending champions Bangladesh: దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తుదిసమయం ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. కాగా, గత ఆసియా కప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు సెమిస్‌లో తలపడగా.. భారత్ ఓటమి చెంది ఇంటిబాట పట్టింది. అయితే ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఆసియా కప్ గెలవగా.. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ఆసియా కప్ గెలిచేందుకు విజయం కోసం వ్యూహాలతో సిద్ధమయ్యాయి.
ఇదిలా ఉండగా, భారత్ జట్టులో యువ బ్యాటర్ 13ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతున్నాడు. మరోవైపు ఆయుశ్ మంచి సహకారం అందించడంతో ఓపెనింగ్ బ్యాటర్లపై నమ్మకం ఎక్కువగా ఉంది. అలాగే, బంగ్లాదేశ్ జట్టు కూడా బౌలింగ్‌లో పట్టిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతోంది.
ఇక, సెమిస్‌లో భారత్ అదరగొట్టి ఫైనల్ చేరుకుంది. షార్జాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 46.2 ఓవర్లలో 173 పరుగులు చేసింది. లక్ష్యసాధనలో బరిలోకి దిగిన భారత్ కేవలం 21.4 ఓవర్లలోనే ఛేదించింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ అదరగొట్టాడు.