Site icon Prime9

Michael Clarke: ఆసీస్ మాజీ ఆటగాడి చెంపలు వాయించిన ప్రియురాలు

micheal clark

micheal clark

Michael Clarke: ఆసీస్ మాజీ ఆటగాడి చెంపను అతడి ప్రియురాలు చెల్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆస్ట్రేలియా  జట్టు మాజీ కెప్టెన్‌.. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (Michael Clarke) కు ఈ చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నావంటూ అతడి ప్రియురాలు.. జేడ్ యాబ్రో బహిరంగంగా చెంపలపై కొట్టింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది.

ఈ వీడియోలో క్లార్క్‌.. తన ప్రియురాలికి సర్ది చెప్పేందుకు విశ్వప్రయాత్నాలు చేశాడు.
కానీ అతడి ప్రియురాలు వినకపోగా.. మరింత రెచ్చిపోయింది.

క్లార్క్ ను భూతులు తిడుతూ రోడ్డుపై గొడవ చేసింది.

ఈ వీడియోలో పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావు అంటూ దాడి చేసింది.

మరింతగా రెచ్చిపోయిన జేడ్ యాబ్రోయయ మదమెక్కిన కుక్కవు అంటూ క్లార్క్‌పై దాడికి దిగింది.

తాను ఎలాంటి తప్పు చేయలేదని క్లార్ల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సదరు మహిళతో చేసిన ఫోన్‌ చాట్‌ను బయటపెట్టాలని జేడ్‌ డిమాండ్‌ చేసింది.

ఆ సమయంలో జేడ్‌ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు.

సంఘటన స్థలాన్ని విడిచి వెళ్తుండగా.. క్లార్క్‌ వారికి అడ్డుతగలడంతో జేడ్‌ మరింత రెచ్చిపోయింది.

క్లార్క్ ను దుర్భాషలాడుతూ అక్కడి నుంచి అతడి ప్రియురాలు వెళ్లి పోయింది.

క్లార్క్‌ తడబడుతూ వారి వెంటపడే ప్రయత్నం చేశాడు.

ఈ ఉదంతంపై క్లార్క్‌ స్పందించాడు.
బహిరంగంగా ఇలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరాడు.

క్లార్క్‌.. తన భార్య కైలీని వదిలేసి ప్రముఖ మోడల్‌ అయిన జేడ్‌తో సహజీవనం చేస్తున్నాడు.

41 ఏళ్ల క్లార్క్‌.. ఆసీస్‌ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు.

టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీ సాయంతో 8643 పరగులు చేశాడు.

వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీల చేశాడు.

వన్డేల్లో క్లార్ట్ 7981 పరుగులు చేయగా.. టీ20ల్లో హాఫ్‌ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు.

టెస్ట్‌ల్లో క్లార్క్‌ అత్యధిక స్కోర్‌ 329 నాటౌట్‌గా ఉంది.

తరచూ వివాదాల్లో నిలిచే ఆటగాళ్లుగా ఆస్ట్రేలియాకు పేరు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.

ఇదేం పద్ధతి అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజెన్లు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version