Asia Cup 2022: ఆసియా కప్ 2022 భాగంగా టీమిండియా ఫైనల్ ఆశలు ఆవిరి ఐపోయాయి. నిన్న రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా శ్రీలంక పై ఘోరంగా ఓడిపోయింది. సూపర్-4 భాగంగా అంతక ముందు పాకిస్థాన్ పై ఒడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. వరసగా రెండు సార్లు ఓటమి చూసిన టీమిండియా ఫైనల్ కు వెళ్ళడం ఇప్పుడు ఇంకా చాలా కష్టం.
భారత్ బ్యాటింగ్ చూసుకుంటే 120 బాల్స్ కు 173 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 41 బాల్స్ కు 72 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 29 బాల్స్ కు 34 పరుగులు, హార్దిక్ పాండ్య 13 బాల్స్ కు 17 పరుగులు చేశారు. ఇక బౌలింగ్ చూసుసుకుంటే యుజేంద్ర చహాల్ 3 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.
శ్రీలంక బ్యాటింగ్ చూసుకుంటే 120 బాల్స్ కు 174 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. మెండిస్ 37 బాల్స్ కు 57 పరుగులు, దసున్ షనక 18 బాల్స్ కు 33 పరుగులు, పథమ్ 37 బాల్స్ కు 52 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ చూసుకుంటే దిల్షాన్ మధుశంక 3 వికెట్లు, దసున్ షనక 2 వికెట్లు, చమిక కరుణరత్నె 2 వికెట్లు , మహేష్ థీక్షణ 1 వికెట్ తీశాడు.