Womens T20: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థిపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేమీమా అద్భుత బ్యాటింగ్ తో.. మరో 7 వికెట్లు ఉండగానే జయకేతనం ఎగరేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించింది. ఈ విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా తొలి అడుగు వేసింది.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్..
గత మెగా టోర్నీలో రన్నపర్ గా నిలిచిన భారత్.. ఈ టీ20 ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. మెుదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ప్రత్యర్థి నుంచి భారీ లక్ష్యం ఎదురైన.. అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. ఈ మ్యాచ్ కు ఓపెనర్ స్మృతి మంధాన దూరమైన.. బ్యాటింగ్‌తో భారత మహిళలు చక్కని రాణించి విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో.. నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఓ దశలో పది ఓవర్లకు.. 58/3తో నిలిచిన పాక్.. ఆ తర్వాతి చెలరేగింది. మిగతా పది ఓవర్లలో సుమారు వంద పరుగుల దాకా రాబట్టారు. చివర్లో భారత్ బౌలర్లు, ఫీల్డర్లు రాణించకపోవడంతో పాక్ భారీగా పరుగులను రాబట్టుకుంది. దీంతో ఆ జట్టు 149 పరుగులకు చేరుకుంది.
తడబడిన భారత్ బ్యాటింగ్.. చివర్లో ఉత్కంఠ (Womens T20)
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు మంచి ఆరంభాన్ని అందించింది. ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్ కు దూరం కావడం పాక్ కు కలిసివచ్చింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన షఫాలీ వర్మ 33 పరుగులు చేసింది. మరో ఓపెనర్ యస్తిక భాటియా 17 పరుగులు చేసి ఔటైంది. ఆ తర్వాత.. హర్మన్ ప్రీత్ సైతం వెంటనే పెవిలియన్ చేరింది. క్రీజులోకి వచ్చిన జెమీమా.. షఫాలీ సాయంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. భారత్ మహిళల జట్టు ఓ దశలో.. నాలుగు ఓవర్లలో 41 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాక్ చేతిలో ఓటమి తప్పదేమోనన్న ఆందోళన కలిగింది. కానీ మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించారు. చివర్లో.. జెమీమా, రిచా మెరుపులే మెరిపించడంతో విజయన సునాయసమైంది. భారత జట్టుకు రివ్యూలు కలిసి రావడంతో మంచిదైంది.
రాణించిన పాక్ మహిళ బ్యాటర్లు..
మెుదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాటర్లు రాణించారు. ఆ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ 68 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. మరో బ్యాట్స్ వుమెన్ అయేషా నసీమ్ 43 పరుగులు చేసింది. ఇక భారత బౌలింగ్ లో రాధ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టి ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత బ్యాటింగ్ లో రిచా ఘోష్ 31 పరుగులు చేసింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. జెమీమా రోడ్రిగ్స్ 53 పరుగులతో రాణించింది. బుధవారం రెండో వన్డే వెస్టిండీస్ తో జరగనుంది.
ఒకే ఓవర్లో ఏడు బంతులు.. గమనించని ఎంపైర్..
మహిళల టీ20 ప్రపంచకప్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఓవర్లో ఏడు బంతులు వేసినట్లు గుర్తించారు. భారత ఛేదనలో ఏడో ఓవర్లో నిదాదర్ ఏడు బంతులు వేసింది. ఇందులో ఒక్కటి కూడా వైడ్, నోబాల్ లాంటివి లేవు. అయినా మరో బంతి అదనంగా వేయడం ఆసక్తి రేపింది. బౌలర్ వేసిన బంతులను అంపైర్ సరిగ్గా లెక్క పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. ఆ బంతి భారత్‌కు మేలు చేసింది. జెమీమా ఆ బంతికి ఫోర్ గా మలిచింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కిదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం గమనర్హం.