Site icon Prime9

India tour of Zimbabwe: రేపటి నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన

India tour of Zimbabwe: రేపటి నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. అయితే వన్డే సిరీస్ కు ముందు భారత్ ను గాయాల బెడద వెంటాడుతుంది. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. సుందర్ స్థానంలో బెంగాల్ ఆటగాడు షాబాజ్ అహ్మద్ కు స్థానం కల్పించింది సెలక్షన్ కమిటీ. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే పర్యటన మొత్తానికి దూరమయ్యాడని వెల్లడించింది.

కాగా, జింబాబ్వేతో వన్డే సిరీస్ కు తొలుత శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించిన సెలెక్టర్లు, రెగ్యులర్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక ధావన్ స్థానంలో జింబాబ్వే సిరీస్ లో టీమిండియా పగ్గాలను రాహుల్ కు అప్పగించారు. ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యజువేంద్ర చహల్ లకు విశ్రాంతి కల్పించారు.

Exit mobile version