Site icon Prime9

Rishab Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కి రోడ్డు ప్రమాదం… తీవ్రగాయాలు, కారు దగ్దం !

rishabh pant health bulletin

rishabh pant health bulletin

Rishab Pant : టీమిండియా యంగ్ క్రికెటర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయినట్లు తెలుస్తుంది. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే అతన్ని దగ్గర్లోని హస్పిటల్‌కు తీసుకెళ్లి, అనంతరం ఢిల్లీకి తరలించారు.

ఈరోజు ఉదయం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా… రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. స్థానికులు రిషబ్‌ను రూర్కీ సివిల్‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లవలసిందిగా అక్కడి వైద్యులు రెఫర్ చేయడంతో రాజధానికి తరలించారు. పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ అక్కడే చేస్తారని సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు. రిషబ్ పంత్ నుదుటిపైన, కాలికి గాయాలైనట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.

అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్‌ కారును పంతే నడుపుతున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. మంటలు చెలరేగగానే అతడు కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేశాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా… పంత్‌ తల, మోకాలికి గాయాలయ్యాయని… వీపు భాగం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Exit mobile version