Site icon Prime9

Dwayne Bravo: టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా డ్వేన్ బ్రావో

Dwayne Bravo: విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో టీ20లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కాడు. ఓవల్ ఇన్విసిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో 600వ వికెట్ తీసి, ఈ ఘనతను అందుకున్నాడు.

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత బ్రావో విండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత దేశవాలీ లీగ్లు ఆడుతున్నారు. ఈ క్రమంలో ది హండ్రెడ్ లీగ్లో నార్తన్ సూపర్ ఛార్జర్స్ తరపున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఓవల్‌ బ్యాటర్‌ సామ్‌ కరన్‌ను ఔట్‌ చేయడంతో బ్రావో టీ20ల్లో 600 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి బౌలర్గా రికార్డు సృష్టించాడు.

2006 ఫిబ్రవరి 16న ఫస్ట్ టీ20 మ్యాచ్‌ ను న్యూజిలాండ్‌పై ఆడాడు. తన కెరిర్ లో ఇప్పటి వరకు 339 మ్యాచులు ఆడి 600 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో 91 మ్యాచులు ఆడిన డ్వేన్ బ్రావో 78 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన 522 వికెట్లను దేశీయ మ్యాచులతో పాటు వరల్డ్ వైడ్గా ఆడిన లీగ్‌లలో సాధించాడు. ఇక బ్రావో ఇప్పటి వరకు 25 జట్లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. అటు ఐపీఎల్‌లో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు. బ్రావో తర్వాత స్థానంలో ఆప్ఘాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 466 వికెట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత విండీస్ స్పిన్నర్ సునిల్ నరైన్ 460 వికెట్లతో మూడో స్థానం..సౌతాఫ్రికా స్పినర్ ఇమ్రాన్ తాహిర్ 451 వికెట్లతో నాల్గో స్థానంలో షకిబ్ అలీ హసన్ 418 వికెట్లతో ఐదో ప్లేస్ లో ఉన్నాడు.

Exit mobile version