Site icon Prime9

Sunrisers Hyderabad: వరుస ఓటముల మధ్య సన్ రైజర్స్ కు గట్టి దెబ్బ

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad: ఐపీఎల్ సీజన్ 16 లో సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్దగా రాణించింది లేదు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ లో చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో 5 మ్యాచులు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రన్ రేట్ ను మెరుగు పర్చుకోవాలి.

 

వరుస ఓటముల మధ్య(Sunrisers Hyderabad)

అయితే వరుసగా ఓటములు చవి చూస్తున్న సన్ రైజర్స్ కు మరో దెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ప్రకటన విడుదల చేసింది. అయితే సుందర్ స్థానంలో ఎవరు వస్తారనే విషయం ఇంకా వెల్లడించలేదు. ‘మోకాలి గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ నుంచి వాషింగ్టన్ సుందర్ తప్పుకున్నాడు. తొడకండరాల గాయం వల్ల మిగతా మ్యాచులను ఆడలేక పోవడం వల్ల విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. సుందర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అంటే సన్ రైజర్స్ ట్వీట్ చేసింది.

 

 

ఢిల్లీ మ్యాచులో పుంజుకుని

తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సుందర్ అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. బౌలింగ్ లో 3 వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్ లో 24 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ సీజన్ తో 7 మ్యాచులు ఆడిన వాషింగ్షన్ సుందర్ 3 వికెట్లు, 60 పరుగులు చేశాడు. మొదటి 6 మ్యాచుల్లో పెద్దగా రాణించక పోయినా.. ఢిల్లీ మ్యాచ్ లో పుంజుకున్నాడు. హైదరాబాద్ జట్టులో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చే సుందర్ లేకపోవడంతో ఎస్ఆర్ హెచ్ కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

కాగా, సన్ రైజర్స్ యాజమాన్యం సుందర్ ను రూ. 8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఒక మ్యాచులో పేలవ బౌలింగ్ ఉంటే, మరో మ్యాచులో బ్యాటింగ్ దారుణంగా ఉంటోంది. దీంతో సన్‌రైజర్స్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. కెప్టెన్సీ మారినా సన్‌రైజర్స్ రాత మాత్రం మారడం లేదు.

 

Exit mobile version