Prime9

IPL 2025: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్.. ఓడితే ప్లే ఆఫ్స్ లేనట్లే!

Sunrisers Hyderabad, Delhi Capitals in IPL 2025: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక, ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడి.. మూడింట్లో నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ 6 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగతా 4మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్స్ ఆశలు అంతంతమాత్రమే అన్నట్లు కనిపిస్తోంది.

 

మరోవైపు ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. మరో 4 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. దీంతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఎలాగైనా ఈ మ్యా్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఉండేందుకు ఢిల్లీ ప్రయత్నిస్తోంది.

 

ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 25 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవగా.. 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 226 పరుగులు చేయగా.. హైదరాబాద్‌పై ఢిల్లీ అత్యధికంగా 207 పరుగులు చేసింది.

 

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడితో ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరవుతాయి. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే తర్వాతి మ్యాచ్‌లు కూడా గెలవాల్సి ఉంటుంది. అంతకుముందు మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. అభిషేక్ శర్మ రాణించినా హెడ్, క్లాసెన్ ఇషాన్ కిషన్, అనికేత్ విఫలమవుతున్నారు. నితీశ్ కుమార్ రెడ్డి గత మ్యాచ్‌లో ఆడినా ఫలితం లేకుండా పోయింది. అలాగే బౌలింగ్‌లోనూ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మహ్మద్ షమీతో పాటు కమిన్స్, హర్షల్, అన్సారీలు మెరుగ్గా వేయడం లేదు. దీంతో ఈ మ్యాచ్‌ గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version
Skip to toolbar