Prime9

Sri Lanka Women vs India Women: శ్రీలంకపై భారత్ భారీ స్కోరు.. గెలిస్తే ఫైనల్!

Sri Lanka Womens vs india Womens : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక మహిళా జట్టుతో భారత్ మహిళా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.

 

భారత్ బ్యాటర్లలో రిచా ఘోష్ (58) హాఫ్ సెంచరీతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 37, ప్రతీక రావల్ 35, హర్మన్ ప్రీత్ కౌర్ 30 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో స్మృతి మంధాన(18), హర్లీన్ డియోల్ (29), దీప్తి శర్మ (24), కాశ్వీ గౌతమ్ (17), స్నేహ్ రాణా (10), అరుంధతి రెడ్డి (9) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమరి, సుగందిక కుమారి చెరో 3 వికెట్లు పడగొట్టగా.. దేవ్ మి విహంగ, ఇనోకా రణవీర తలో వికెట్ తీశారు.

 

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే నేరుగా ఫైనల్ వెళ్లనుంది.  ఇప్పటికే భారత్ శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా జట్టుపై గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికాపై శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్ రేసులో ఉంది.

 

భారత్: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, అరుంధతిరెడ్డి, కాష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, శ్రీ చరణి.

శ్రీలంక: చమరి, హాసిని, విష్మి, హర్షిత, కవిష, నీలాక్షి డి సిల్వా, అనుష్క, దేవ్ మి విహంగ, మల్కి, సుగంధిక కుమారి, ఇనోకా రణవీర.

Exit mobile version
Skip to toolbar